Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasinipattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

జరిగిన కథ: తమ కేబిన్ లో కూర్చుని టీవీ లో తమ చానల్ ప్రసారం చేస్తున్న ప్రోగ్రాం చూస్తుంటారు తేజ, సుధామ. ఇంతలో బాస్ నర్సిమ్హం నుంచి పిలుపొస్తుంది. ఇద్దర్నీ కూర్చోబెట్టి క్రైం ప్రోగ్రాంస్ తాలూకు ప్రోగ్రస్ వివరంగా అడుగుతుంతాడు... ఆ తరువాత... 

 

ఇంతలో... చాంబర్‌లో మ్యూట్‌లో ఉన్న టీవీ స్క్రీన్‌పై బ్రేకింగ్‌ పడిరది. తెలుసుకుందామనే కుతూహలంతో రిమోట్‌ తీసుకుని వాల్యూమ్‌ పెంచాడు నరసింహం.

చెవులు దద్దరిల్లే మ్యూజిక్‌ నేపధ్యంలో యాంకర్‌ చెప్తోంది....‘‘ఇప్పుడే మనకో బ్రేకింగ్‌ న్యూస్‌ అందుతోంది. సీఎం కుటుంబ సభ్యులు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామునే తిరుమల చేరుకున్న సీఎం దంపతులు కొడుకు, కూతురితో సహా శ్రీవారిని దర్శించుకున్నారన్న బ్రేకింగ్‌ న్యూస్‌ మనకందుతోంది....’’యాంకర్‌ చెప్తుండగా స్క్రీన్‌పై  ‘తిరుమలలో సీఎం...శ్రీవారిని దర్శించుకున్న సీఎం దంపతులు...పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం...సీఎం ప్రత్యేక దర్శనం సందర్భంగా తిరుమలలో భక్తుల ఇక్కట్లు...’’ఇలా వరుసగా అక్షరాలు ప్రత్యక్షమవుతున్నాయి.

ఆ వెంటనే...స్పాట్‌ విజువల్స్‌. శ్రీవారి ఆలయంతో సహా...సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం చెప్పిన అధికారులు, పూజారుల్ని విజువల్స్‌లో చూపిస్తుండగా..యాంకర్‌ చదివిందే మళ్లీ మళ్లీ చదువుతోంది.

‘‘అద్సరే...తిరుమలలో సీఎం బ్రేకింగేంటయ్యా? ఏడుకొండలవాడికే ఇంత ఇంపార్టెన్స్‌ ఇవ్వడం లేదు?’’ చిరాకు పడుతూ చానెల్‌ మార్చాడు నరసింహం.

ఆ చానెల్‌లోనూ అదే బ్రేకింగ్‌ న్యూస్‌.

‘‘తిరుమలలో సీఎం...శ్రీవారిని దర్శించుకున్న సీఎం దంపతులు...పూర్ణకుంభంతో సీఎంకు స్వాగతం’’ అక్షరం పొల్లు పోకుండా అదే ఇన్‌ఫర్మేషన్‌.

‘‘ఇదంతా కామనే సార్‌...ప్రతీ చానెల్‌ మరో చానెల్‌ని కాపీ కొడుతూనే ఉంటుంది...స్క్రోలింగ్‌లన్నీ అన్ని చానెల్స్‌లోనూ ఇంచుమించు ఒకేలా ఉంటాయి...’’ సుధామ అంటుంటే ‘చాలన్న’ట్లు చూసాడు నరసింహం.

ఆ తర్వాత`‘‘అపర్ణ ఇన్సిడెంట్‌ తెలిసిన తర్వాత ఏం చేసాం?’’అడిగాడు.

‘‘ముందు బ్రేకింగ్‌న్యూసిచ్చాం. తర్వాత ప్యాకేజీ చేసాం. అంటే...ఇన్సిడెంట్‌ వివరాల్ని అందిస్తూ యాంకర్‌, వాయిస్‌ఓవర్‌, విజువల్స్‌తో కూడిన స్టోరీ అన్నమాట. ఆ తర్వాత...ఈమధ్య జరిగిన ఇలాంటి ఇన్సిడెంట్స్‌ని మరోసారి గుర్తు చేస్తూ  ఫోకస్‌ పేరుతో హాఫెనవర్‌ స్పెషల్‌ స్టోరీ ప్రైమ్‌టైమ్‌లో టెలికాస్ట్‌ చేసాం. మళ్లీ ఇందాక క్రయిం బులెటెన్‌లో అపర్ణ కేసు పూర్వపరాల్ని వివరిస్తూ ప్రజంట్‌ చేసాం...’’ చెప్పాడు సుధామ.‘‘ఇదే కేసు మరో ఆర్నెల్లకీ ఇలాగే ఉంటే...అప్పుడేం చేస్తారు?’’

‘‘పోలీసులే కేసు మూసేస్తారు. మనకీ ఇన్సిడెంట్‌తో పనేం ఉంటుంది? మళ్లీ ఇలాంటిదేదో జరిగినప్పుడు  ఖాకీల్ని ఎండగడుతూ స్టోరీ చేయడానికి అపర్ణ ఇన్సిడెంట్‌ కూడా పనికొస్తుంది. అందుకే, విజువల్స్‌తో సహా లైబ్రరీలో భద్రపరుస్తాం’’

‘‘అది చాలదు...’’అంటూ తేజవైపు చూసాడు నరసింహం.

‘‘క్రయిం రిపోర్టర్‌ అంటే ఒంటిమీద ఖాకీడ్రస్‌ లేని పోలీస్‌ ఆఫీసర్‌. ఆ డెడికేషన్‌తోనే వర్క్‌ చేయాలి. అర్ధాంతరంగా పోలీసులు వదిలేసిన సెన్సేషనల్‌ కేసులన్నీ క్రయిం రిపోర్టర్లే దుమ్ము దులపాలి. విపరీతమైన ఒత్తిడిలో ఉన్న పోలీసులిచ్చిన అరకొర సమాచారంతో న్యూసిస్తే సరిపోదు. పాతకేసులన్నీ తిరగదోడాలి...’’ అన్నాడు నరసింహం.

అర్ధం కానట్టు అతడివైపు ఇద్దరూ చూసారు.

‘‘ఎప్పుడో ఓ క్రయిం జరిగుంటుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లు మన మీడియా ఓ రెండ్రోజులు  విపరీతమైన కవరేజ్‌ ఇస్తుంది. ఆ తర్వాత అంతకుమించిన ఇన్సిడెంట్‌ రావడంతో అక్కడితో దాన్ని ఆపేస్తుంది. అయితే, మనమిచ్చిన కవరేజ్‌ని జనం మరిచిపోరు. ఓ డెయిలీ సీరియల్‌ అర్ధాంతరంగా ఆగిపోయినట్లు ఫీలవుతారు. ఫలానా క్రయిం ఇన్సిడెంట్‌లో ఇన్‌వాల్వ్‌ అయిన వ్యక్తులేమయ్యారు...ఇప్పుడెక్కడున్నారు? అసలు దోషులు పట్టుపడ్డారా?శిక్ష పడిరదా? ఆ శిక్ష ఎన్నాళ్లు? ఏ జైళ్లో  ఇప్పుడున్నారు?

ఇలాంటి సందేహాలెన్నో వ్యూయర్స్‌కి కలుగుతుంటాయి. మనం కవర్‌ చేసిన క్రయిం ఇన్సిడెంట్స్‌కి సంబంధించిన  క్లయిమాక్స్‌ చెప్పాల్సిన బాధ్యత మనదే కదా! అందుకే...పాత క్రయింల కోసం కొత్త ప్రోగ్రాం మొదలెట్టాలి’’ చెప్తున్నాడు నరసింహం. శ్రద్ధగా వింటున్నారు సుధామ, తేజ.

‘‘అసలు ఆ క్రయిం  సవివరంగా తెలియజేస్తూ పోలీస్‌ ఠాణాలో ప్రజంట్‌ స్టేటస్‌ను వివరించాలి. సంఘటనకు సంబంధించిన విజువల్స్‌...కేసు డీల్‌ చేస్తున్న పోలీస్‌ అఫిషియల్స్‌ ఇంటర్వ్యూలు, ఫామిలీ మెంబర్ల రియాక్షన్లతో స్పెషల్‌ క్రయిం బులెటెన్‌ ప్లాన్‌ చేయండి. ప్రతి సన్డే ప్రయిం టైమ్‌లో టెలికాస్టయ్యేలా చూడండి. తేజా... అక్షరాల్లో అగ్ని పుట్టించు. మాటల్లో మందుపాతర్లు దట్టించు. మన చుట్టూ ఇన్ని క్రయింలు జరుగుతున్నా పరిష్కరించడంలో చేవచచ్చిన ఖాకీలకు మన ప్రోగ్రామ్‌ సవాల్‌ కావాలి. ఈ  బులెటెన్‌ ఖాకీల్ని ఉరుకులు పరుగులు పెట్టించాలి. మనం డీల్‌ చేసే ప్రతి  కేసు పరిష్కరించేదాకా పోలీసులకు నిద్రే కరువవ్వాలి. ఈ ప్రోగ్రామ్‌కి మంచి పేరు పెట్టండి. ప్రోమోస్‌ రెడీ చేయండి. అన్నట్లు...ఫస్ట్‌ బులెటెన్‌కి ఏ ఇన్సిడెంట్‌ తీసుకుందాం’’ అడిగాడు నరసింహం.

‘‘విశాఖలో మర్డరైన టీవీ ఆర్టిస్ట్‌ సుజి కేసు...’’ సూచించాడు తేజ. అతడికెన్నాళ్లగానో విశాఖ సముద్రాన్ని చూడాలని ఉంది. స్వామికార్యం..స్వకార్యంలా వెళ్లి రావచ్చనుకున్నాడు. అందుకే, ఆ ఇన్సిడెంట్‌ బాస్‌ దృష్టికి తెచ్చాడు.

‘‘అదీ చేద్దాం. అంతకన్నా ముందుగా...’’ అంటూ టేబుల్‌పై ఉన్న కవర్లోంచి ఓ ఫొటోని బయటకి తీసాడు నరసింహం.‘‘ఈ అమ్మాయి మీకు తెలుసు కదా?’’ అడిగాడు ఫొటో చూపిస్తూ.

నింగి నుంచి నేలకు దిగొచ్చిన ఓ తారక ముచ్చటపడి కెమెరాకు ఫోజిచ్చిన్నట్లుందా ఫొటో. అందమైన షిఫాన్‌ చీరలో ఒద్దికగా ఇమిడిపోయిన పాతికేళ్ల ప్రాయం. కన్రెప్ప వాలనీయకుండా కనికట్టు చేసే ఆకర్షణ ఆమె సొంతం. గుండెల్ని సూటిగా తాకి...ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే తుఫాన్‌ సోయగం. అల్లనల్లన కదిలే ముంగురులు...నుదుటిపై దీపంలా వెలుగుతున్న చిన్ని బొట్టు. ఎర్రెర్రని పెదాలకొమ్మలపై విరబూస్తున్న తెల్లని చిర్నవ్వుల మల్లెలు...విశాల నేత్రాలకు హద్దులు గీస్తున్న కాటుక రేఖలు...ఒక్కమాటలో చెప్పాలంటే...ఆమె ఓ సమ్మోహానాస్త్రం.‘‘ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా?’’ అడిగాడు నరసింహం.

‘‘మరిచిపోయేంత అందమా ఆమెది. ఆమె ప్రతిమ’’ అన్నాడు తేజ.

‘‘ఔను... ప్రతిమే. వాగ్దేవి ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌. ట్వంటీఫైవ్‌ ఇయర్స్‌. ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చేరి సెలబ్రెటీ ఐడిరటిటీని తెచ్చుకుంది.  అందమైన అమ్మాయిలు హీరోయిన్లే అవుతారు. కెమెరా వుమెన్‌గా, క్రియేటివ్‌ జీనియస్‌గా రాణించడం అరుదు. ప్రతిమ అలా కాదు. ముట్టుకుంటే మాసిపోయేంత అందం ఉన్నా...బ్రెయిన్‌నే నమ్ముకుంది.  రీళ్లను చుట్టేసే ఫార్ములా సిన్మాలకు భిన్నంగా ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని ప్లాన్‌ చేసింది. లెస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌...మోర్‌ ఇన్‌కం ఫార్ములాతో న్యూ వేవ్‌ క్రియేట్‌ చేసింది. తన ప్రాజెక్ట్‌ల్తో ఇండస్ట్రీనే హడలెత్తించింది. అంత క్రియేటివిటీని చూసి ఆ క్రియేటరే ముచ్చటపడ్డాడేమో? అర్ధాంతరంగా తనువు చాలించింది. ఆమె డెత్‌ సీక్రెట్‌ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.  ఆ మిస్టరీని మన చానెల్‌ ఛేదించాలి. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో బయటకి కనిపించని శత్రువులు తనకూ ఉన్నారని చెప్పుకొచ్చింది. ఆ శత్రువులెవరో కనిపెట్టాలి’’ అన్నాడు నరసింహం ఆవేశంగా.

‘‘తప్పకుండా సార్‌...అన్నట్టు, తను మన చానెల్‌కీ ఇంటర్వ్యూ ఇచ్చింది. ‘బ్యూటీ విత్‌ బ్రైన్‌’ పేరుతో ఆ ఇంటర్వ్యూ చేసింది నేనే. కానీ, దురదృష్టం. ఆ ఇంటర్వ్యూ చూసుకోకుండానే ఆమె చనిపోయింది’’ తేజ మాటల్లో ఆమె పట్ల ఆరాధన వ్యక్తమైంది.

‘‘మనం చేసే ఫస్ట్‌ క్రయిం స్పెషల్‌ బులెటెన్‌ ఈ అమ్మాయి కేసునే ఇన్విస్టిగేట్‌ చేయాలి. ఆ అమ్మాయి ఎందుకు మరణించింది. ఆమె చావుకి ముహూర్తం పెట్టిందెవరు? హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందా? లేక, నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందా? ఆమె చనిపోవడం వెనుక ఉన్న క్రిమినల్స్‌ ఎవరు? ఈ నిజాలు నిగ్గు తేల్చాలి. అమ్మాయిల మరణాలు ఖాకీఠాణాల్లో మిస్టరీలుగా మారకూడదు....తేజా! ప్రతిమ మరణం వెనుక మిస్టరీ ఛేదించు’  ఉత్సాహపరిచాడు నరసింహం మీటింగ్‌ ముగిసిందన్న సంకేతంలా కుర్చీలోంచి లేస్తూ.

‘‘ప్రతిమ కేసుపట్ల బాస్‌కెందుకంత ఇంట్రస్ట్‌? ప్యాకేజ్‌ ఎండ్‌వాయిస్‌లో వాయిస్‌ఓవర్‌ ఆర్టిస్ట్‌ ఆనవాయితీగా వ్యూయర్స్‌కి చెప్తున్నట్లు...ఈ డౌట్‌ తీరాలంటే మరికొంత కాలం ఆగాల్సిందేనా?’’ లోలోన నవ్వుకున్నాడు సుధామ.

ఓ ఆగంతకుడెవరో సెక్యూరిటీ దగ్గర హల్చల్‌ చేస్తున్నాడు. దురుసుగా ప్రవర్తిస్తూ ఆఫీసులోనికి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. తేజ తన క్యాబిన్‌లో కూచుని వర్క్‌ చేస్తూ యధాలాపంగా అద్దాల కిటికీలోంచి కిందికి చూపు సారిస్తే కనిపించిన దృశ్యమది. వెంటనే ఫోనందుకుని సెక్యూరిటీకి కాల్‌ చేసాడు తేజ.

‘‘సర్‌...’’ అన్నాడు సెక్యూరిటీ నుంచి ఓ వ్యక్తి.

‘‘ఎవరది...ఏంటా గొడవ?’’ అడిగాడు తేజ.

‘‘ఎవరో నాగరాజుగారట. యాంకర్‌ వరలక్ష్మిని ఇప్పటికిప్పుడే కలుసుకోవాలనుకుంటున్నాడు’’ చెప్పాడతడు.

‘‘ఎందుకు?’’

‘‘ఏమో? అర్జంట్‌గా మాట్లాడాలంటున్నాడు. వరలక్ష్మి ఆఫీసులో లేదంటే కసురుకుంటున్నాడు. బలవంతంగా లోనికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. అడ్డుకోబోతే బండబూతులు తిడుతున్నాడు’’ సెక్యూరిటీ అతను చెప్తుంటే ఆ ఆగంతకుడు అతడి చేతిలోంచి రిసీవర్‌ లాక్కోవడం కనిపించింది తేజాకి.

‘‘మీకెవరు కావాలి?’’ అడిగాడు తేజ.

‘‘యాంకర్‌ వరలక్ష్మి..’’

‘‘ఆవిడ మీ రిలెటివా, ఫ్రెండా, క్లాస్‌మేటా?’’

‘‘తను నాకేం కాదు’’

‘‘మరి, ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నారు?’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్