Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Naa Paata 18 - Kani Penchina Ma Ammake - MANAM

ఈ సంచికలో >> సినిమా >>

గతాన్ని గుర్తుచెయ్యొద్దంటున్న అడల్ట్‌ స్టార్‌

adult star

గత జీవితాన్ని తలచుకుని బాధ పడను. ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నానంటే అది గత కాలం చేసిన పనుల ద్వారా వచ్చిన పాపులారిటీ కారణంగానే అనే నిన్నటిదాకా కబుర్లు చెప్పిన సన్నీలియోన్‌, తన గతాన్ని గుర్తు చేయవద్దని చెబుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఓ మహిళ, సన్నీలియోన్‌ ‘బూతు’కి ప్రచారకర్తగా మారిందనీ, ఆమె పేరుతో నడుస్తున్న అధికారిక వెబ్‌సైట్‌లోనూ బూతు సమాచారమే ఉందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సన్నీలియోన్‌ ఇబ్బందుల్లో పడిరది. కేసు విచారణలో భాగంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట సన్నీలియోన్‌ హాజరయ్యింది. గత కాలంలో తాను పోర్న్‌ స్టార్‌గా నటించినప్పటి వీడియోలు చూపించి, ఇప్పుడు తనను కేసుల్లో ఇరికించడం తగదని, వాటికి దూరంగా ఉంటూ బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నానని పోలీసులకు వివరించింది సన్నీలియోన్‌. బాడీగార్డుల సహాయంతో పోలీస్‌ స్టేషన్‌కి వచ్చిన సన్నీలియోన్‌ రెండు గంటలపాటు పోలీసులు వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఆమె సమాధానాల్ని పోలీసులు రికార్డ్‌ చేశారు. తెలుగులో ‘కరెంట్‌ తీగ’ సినిమాలో సన్నీలియోన్‌ నటించింది.

మరిన్ని సినిమా కబుర్లు
rakul rakul rakul