Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
adult star

ఈ సంచికలో >> సినిమా >>

రకుల్‌ రకుల్‌ రకుల్‌

rakul rakul rakul

తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా దూసుకుపోతోంది ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ ఫేం రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంతో కెరీర్‌లో ఆమె ముందుకు వెళుతోంది. రేపు విడుదలయ్యే ‘పండగ చేస్కో’ సినిమా, రవితేజ సరసన నటించిన ‘కిక్‌2’ సినిమాలు హీరోయిన్‌గా ఆమె కెరీర్‌లో ఇంకా వేగం తీసుకొస్తాయట. ‘పండగచేస్కో’ సినిమాలో రామ్‌ హీరో. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం చాలా యాక్టివ్‌గా మీడియా ముందుకు వస్తోంది రకుల్‌. స్పష్టంగా తెలుగులో మాట్లాడుతూ తెలుగు సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న రకుల్‌, తెరపై గ్లామర్‌తో యువ హృదయాల్ని ఇప్పటికే కొల్లగొట్టింది. రామ్‌చరణ్‌తో రకుల్‌ చేస్తున్న సినిమా అక్టోబర్‌లో విడుదల కానుంది. శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతుంది ఈ సినిమా. కేవలం ఆరు నెలల వ్యవధిలో రకుల్‌ నటిస్తున్న మూడు సినిమాలు విడుదలవుతాయి. ఇవి కాకుండా ఎన్టీఆర్‌తో ఓ సినిమా, మహేష్‌తో ఓ సినిమా కూడా చేయనున్న రకుల్‌, మిగతా హీరోయిన్లకన్నా చాలా వేగంతో దూసుకెళ్ళడమే కాకుండా సక్సెస్‌లు కూడా అందుకుంటోంది. అందుకే టాలీవుడ్‌లో రకుల్‌ నామస్మరణ కనిపిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
Nobody arer number 1