Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rakul rakul rakul

ఈ సంచికలో >> సినిమా >>

నెంబర్‌ వన్‌ ఎవరూ కాదు: ప్రియాంకా చోప్రా

Nobody arer number 1


హీరోల గురించే నెంబర్‌ వన్‌ అని చెప్పే రోజులు పోయాయి. బాలీవుడ్‌లో హీరోయిన్లు కూడా హీరోలకు ధీటుగా సక్సెస్‌లు కొడుతున్నారు. ‘మేరీకోమ్‌’ సినిమాతో ఫిమేల్‌ ఓరియెంటెడ్‌ మూవీ చేసి సూపర్‌ స్టార్‌ అనిపించుకున్న ప్రియాంకా చోప్రా, ‘పికు’ స్టార్‌ దీపికా పడుకొనేతో పోటీ పడ్తోంది. సైలెంట్‌గా కంగనా రనౌత్‌ కూడా వీరిద్దరికీ పోటీ ఇస్తోంది. అయితే సినీ రంగంలో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ ఎవరని అడిగితే ప్రతి శుక్రవారం ఆ ప్లేస్‌లోకి ఎవరో ఒకరు కొత్తగా వస్తారు తప్పించి నెంబర్‌ వన్‌ అని ఎవరూ ఉండరని ప్రియాంకా చోప్రా చెప్పింది. ప్రేక్షకుల్ని అలరించడం గురించి తప్ప నెంబర్‌ పొజిషన్‌ గురించి ఎప్పుడూ ఆలోచించకపోవడమే తన విజయరహస్యమని అంటుందీ అందాల భామ. దీపికా పడుకొనే, విద్యా బాలన్‌, కరీనాకపూర్‌, కత్రినాకైఫ్‌ లాంటి తారలూ ప్రియాంక అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. ఈ ఆరోగ్యకరమైన పోటీ అభినందనీయం. అమీర్‌ఖాన్‌, షారుక్‌ఖాన్‌, సల్మాన్‌ఖాన్‌ వంటి సూపర్‌ స్టార్స్‌ కూడా ప్రియాంక వ్యాఖ్యలకు మద్దతు తెలిపారు.

మరిన్ని సినిమా కబుర్లు
heroin