Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Nobody arer number 1

ఈ సంచికలో >> సినిమా >>

ఆ హీరోయిన్‌ ఆటోబయోగ్రఫి

heroin

సినిమా రంగానికి చెందినవారు లేదంటే రాజకీయ ప్రముఖులు లేదా ఎవరైనా ఆటోబయోగ్రఫీ రాస్తుంటే అందులో వివాదాస్పద అంశాలు ఏముంటాయోనని ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. సినీ ప్రముఖులు రాసే ఆటోబయోగ్రఫీ విడుదల కాకముందే వివాదాస్పదమవుతుంటుంది. మరీ పాత తరం హీరోయిన్‌ కాకపోయినా కొన్నేళ్ళ క్రితం హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించిన లిజి తన ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నానని ప్రకటించి కొందరి గుండెల్లో గుబులు రేపింది. దర్శకుడు ప్రియదర్శన్‌ని వివాహం చేసుకున్న ఈ మాజీ హీరోయిన్‌, ప్రస్తుతం సింగిల్‌గానే ఉంటోంది. సినిమాల్లో మళ్ళీ నటించే ఆసక్తి తనకు లేదని చెబుతూ ఆటోబయోగ్రఫీ రాసుకోవడం ద్వారా తన జీవితం తన అభిమానుల ముందుంచినట్లవుతుందని భావిస్తున్న లిజి, అందులో ఏమేం అంశాల్ని పొందుపరుస్తుందోననే టెన్షన్‌ క్రియేట్‌ చేసింది. లిజి ఆటోబయోగ్రఫీ ఈ సంవత్సరంలోనే విడుదలవుతుందట.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam