Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee -  ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావు

sahiteevanam

'ఆముక్తమాల్యద' 

(గతసంచిక తరువాయి)

శ్రీ వేంకటేశ్వరుని శ్రోతగా చేసుకుని, వినూత్నమైన, విచిత్రమైన వర్ణనలతో ఐదవ ఆశ్వాసాన్ని వినిపించడం మొదలుబెట్టాడు రాయలవారు.

శ్రీనీళాజాంబవతీ 
మానసతామరసవిహరమాణమిళిందా! 
భానద్యుదయకళిందా!
నానాంఘ్రిశిరోక్ష! శేషనగహర్యక్షా!

కావ్యం సాగుతున్నకొద్దీ కథనంలో పెరుగుతున్న వడికి, ఈ ఆశ్వాసములోని ప్రధాన అంశమైన గోదా రంగనాథుల ప్రణయప్రవాహవేగానికీ చనగా ఒక్క ఉదుటున దీర్ఘ సమాసాలతో మొదలుబెట్టాడు

రాయలవారు.

శ్రీదేవి, నీళాదేవి, జాంబవతీదేవి అనే మువ్వురి మనసులనే తామరలయందు విహరించే మద భృంగమా! నీ శరీరకాంతి అనే నల్లని కాళిందీ వాహానికి పుట్టుకస్థానమైన కళింద పర్వతమువంటివాడా! అనేక పాదములు, శిరస్సులు, కన్నులు కలిగినవాడా! శేషాచలముపై వెలసిన హమా! అవధరించుమయ్యా అంటున్నాడు. గోదాదేవి కళ్యాణగాథను చెప్పడం మొదలెట్టి నాలుగు ఆశ్వాసాలు పూర్తి ఐనతర్వాత ఈ ఐదవ శ్వాసములో ఆమెపాత్రను ప్రత్యక్షముగా పరిచయము చేస్తున్నాడు రాయలు. యిది ఒక విచిత్రము అయితే, ఆమె పాత్రను ప్రవేశపెట్టడం అన్న లోచనతోనే రుక్మిణి(లక్ష్మి), నాగ్నజితి(నీళాదేవి)జాంబవతి గుర్తుకొచ్చారు రాయలకు, యమునానది(కాళింది)గుర్తుకొచ్చింది. యమునానదీ రములోనే కాత్యాయనీవ్రతం చేసి గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందారు, గోదాదేవి కూడా ఆ వ్రతాన్నే ధనుర్మాసములోఆచరించింది, దేవదేవుని తిదేవునిగా పొందడానికి, తనను గోపికగా భావించుకుంది, విల్లిపుత్తూరును వ్రేపల్లెవాడగా భావించింది, కనుక యమునానది గుర్తుకొచ్చింది, మి నల్లని శరీరకాంతి అనే ప్రవాహాన్ని పోల్చడానికి. అంతే కాదు, యమున మొహానికి చిహ్నం, ప్రేమకు చిహ్నం, స్వామి గోదాదేవి హపాశములో చిక్కుకున్నాడు, ఆమె కూడా ఆయనను ప్రేమించింది కనుక యమునానది గుర్తుకొచ్చింది. 

ఎప్పటిలానే తనమానాన తాను స్వామికి మాలాకైంకర్యము చేసుకుంటూ నిరంతరమూ స్వామిస్మరణలోనే గడుపుతున్న విష్ణుచిత్తులవారు కరోజు తులసీదళములకోసము, పూవులకోసము తన తోటలోకి వెళ్ళాడు.ఇక్కడ ఆ తోటను ఒక శృంగారరస భరితమైన 'మహా స్రగ్ధర'లో ప్పాడు రాయలవారు, యిక ముందు ముందు అంతా శృంగార, ప్రేమరస ప్రవాహమే కనుక. 

ఒకనాఁడామ్రాంకురౌఘంబురు కుసుమ కుడుంగోదరక్షోణిఁ దల్ప
ప్రకరం బై కాంక్షచే మున్ పతులఁబదరి పైఁబ్రౌఢి వాటించి నిట్టూ
ర్పెకదొట్టన్ డస్సి వీరాయిత మఱి  మఱి తా రెట్ల మున్నట్లయౌనా
యికలం గందర్పుఁడోటం బెఱిఁగి తఱిమి వీఁ పేసె నా నంటు తోఁటన్ 

ఆ తోటలో మావిడి చివుళ్ళ సమూహము, విరివిగా పూపొదరిళ్ళు ఉన్నాయి. ఆ పొదరిళ్ళ మధ్య మదవతులు తమ మగవారిని పెనగి క్రిందికి సి, తాము మీదై ఉపరతి చేసి చేసి అలసి, ఆయాసపడి, ఇక చేతగాక మరలా తమ మగవారిని మీదకు లాక్కుని తాము క్రిందై రతిపారవశ్యాన్ని దారేమో,అలా రతిక్రీడలో తాము ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించి ఓడిపోయి, మరలా 'క్రిందై' పోవడం వలన, ఆటలలో డిపోయినవారి పులమీద గెలిచినవారు 'చరిచి' గెలిచేయడం మామూలే కనుక,ఆ ఓడిపోయిన స్త్రీల వీపులమీద మన్మథుడు చరిచినప్పుడు పడిన కమిలిన దిన గుర్తుల్లాగా, ఆ నేలమీద రాశులుగా పడిన చివుళ్ళు కనిపిస్తున్నాయి, అటువంటి తోటలోకి అడుగుబెట్టాడు విష్ణుచిత్తులవారు. ఆ దరిళ్ళమధ్యనున్న నేలమీద రాలిన లేత లేత ఎఱ్ఱని చివుళ్ళు ఆ మదవతుల  వీపులమీద మన్మథుడు చరిచినపుడు ఏర్పడిన గాయాల్లా ఉన్నాయి.   

వింగడ మైన యొక్కవనవీథిఁ గనుంగొనె నీడ సున్నపున్ 
రంగుటరంగు పచ్చల యరం గయి పో వెలిదమ్మిబావికిం 
జెంగట నుల్లసిల్లు తులసీవనసీమ శుభాంగి నొక్క బా
లం గురువింద కందళ దళ ప్రతిమాంఘ్రి కరోదరాధరన్ 

అటువంటి తోటలోకి, వింగడమైన అంటే చక్కగా పండ్లనిచ్చేచెట్లు ఒకప్రక్కన, కూరగాయలనిచ్చే చెట్లు ఒకప్రక్కన, పూవులనిచ్చే లతలు, చెట్లు కప్రక్కన, తులసీ వనము ఒకప్రక్కన, ఏ జాతికి ఆ జాతి ఒకప్రక్కన ఉండేట్లుగా ప్రత్యేకముగా విభజింపబడి, శ్రద్ధగా పోషింపబడుతున్న టలోకి డుగుబెట్టాడు విష్ణుచిత్తులవారు. తోటలను, ఉద్యానవనములను పెంచవలసిన పద్ధతి యిది. ప్రతి వృక్షానికి, ప్రతి లతకు,ప్రతి పుష్పానికి త్యేకమైన లక్షణం ఉంటుంది. అందుకని వేరువేరుగా పెంచాలి. పూజకు సేకరించే పూలను కూడా విడివిడిగా సేకరించి, వేర్వేరు సెజ్జలలోనో, ళ్ళాలలోనో ఉంచి పూజ చేయాలి. పుష్పచింతామణి అనే ఒక ప్రాచీన గ్రంథం ఉన్నది, ఏయే పుష్పాలకు ఏమేమి లక్షణాలు, ఏమేమి ఫలితాలు టాయో అన్న సంగతి చెప్తుంది. సమస్త శాస్త్రములనూ అభ్యసించిన మహా జ్ఞాని రాయలు, కనుక 'వింగడమైన వనవీథి' అన్నాడు.ఆ తోటలో ల్లని సున్నపురంగులో ఉన్న పాలరాతి అరుగు ఒకటి ఉన్నది. చుట్టూ ఉన్న చెట్లనీడ దానిమీద ప్రతిఫలించి పచ్చలు తాపిన అరుగులాగా కుపచ్చరంగులో మెరిసిపోతున్నది ఆ తెల్లని అరుగు. ఆ అరుగు సమీపములో విరివిగా తామరలు వికసించిన ఒక దిగుడుబావి ఉన్నది. ఆ గుడుబావికి సమీపంలో తులసీవనము ఉన్నది. ఆ తులసీవనములో ఒక శుభాంగిని, పగడపు తునకలవంటి లేత లేత ఎఱ్ఱని పాదములను, రములను, అధరమును, ఉదరమును కలిగిన బాలికను చూశాడు విష్ణుచిత్తులవారు.

కావ్యప్రారంభము శార్దూలవిక్రీడితంతో చేయడం అనే సంప్రదాయాన్ని ప్రక్కనబెట్టి, ఉత్పలమాలతో మొదలెట్టిన సంగతిని, అందుకు గల రణం(  వ్యాసకర్త ఉద్దేశములో) ఈ సుదీర్ఘవ్యాస ప్రారంభములో చర్చించుకున్నాము. నాలుగు ఆశ్వాసాలు, ఐదువందల డెభ్భై పద్యాలూ పోయినతర్వాత, యిప్పుడుప్రత్యక్షముగా గోదాదేవి పాత్రను ప్రవేశపెడుతున్నాడు రాయలవారు. ఇక్కడకూడా ఉత్పలమాల పద్యముతోనే దాదేవిని పరిచయము చేస్తున్నాడు. దీనికి కూడా ఈ వ్యాసప్రారంభములో ఉదహరించిన విషయమే కారణము. ఉత్పలము అంటే కలువ. న్మథునికి ఉన్న ఐదు బాణాలు అరవిందము, అశోకము, మామిడి, నవమల్లిక, నల్లకలువ. వీటిలో ఒక్కొక్క పువ్వుకు(ఒక్కొక్క ణానికి)ఒక్కొక్క లక్షణము ఉన్నది. నల్లకలువకు నిశ్చేష్టులుగా చేయడం లక్షణము. గోదాదేవి తను ధరించి విడిచిన పూమాలకు స్వామిని రిగించి, ఆయనను మోహపాశములో బంధించి, నిశ్చేష్టుడిని చేసింది, లొంగదీసుకుంది, కనుక ఆవిడ సమర్పించిన మాల నీలోత్పలమాల, నికి సూచనగా రాయలు వాడుకున్నది ఉత్పలమాల. ఇంతవరకూ చెప్పిన నాలుగు ఆశ్వాసాలలో ఏ ఆశ్వాసములో కూడా ప్రథానమైన షయాన్ని 'ఉత్పలమాల' తో ప్రారంభము చేయలేదు రాయలు, ఉద్దేశపూర్వకముగానే.

కనుఁగొని విస్మయం బొదవఁగా గదియం జని సౌకుమార్యమున్ 
దనురుచియున్సులక్షణవితానముఁ దేజముఁ  జెల్వుఁ గొంత సే
పనిమిషదృష్టిఁ  జూచి యహహా యనపత్యునకమ్ముకుందుఁడే 
తనయఁగ నాకు నీ శిశువుఁ దాఁ  గృప సేసె నటంచు హృష్టుఁడై 

తులసీవనములో ఆ బాలికను చూసి, విస్మయము చెంది, దగ్గరికి వెళ్లి, ఆ శిశువుయొక్క సౌకుమార్యాన్ని,శరీర కాంతిని, శరీర భలక్షణములను, తేజస్సును కొంతసేపు రెప్పవాల్చకుండా చూసి, 'ఆహా! సంతానము లేని నాకు ఆ ముకుందుడే ఈ శిశువును కుమార్తెగా సాదించాడు' అని సంతోషించాడు విష్ణుచిత్తులవారు.

కొనిపోయి ధర్మగేహిని 
కనురక్తి నొసంగఁ బొంగి యాయమయును జేఁ 
పు నిజస్తన్యంబుల చేఁ 
బెనిచె న్గో మొప్ప నిట్లు పెరుఁగఁ గ్రమమునన్ 

ఆ శిశువును తీసుకెళ్ళి తన భార్యకు అప్పగించాడు. ఆమెకు కూడా పట్టరాని ఆనందము కలిగి, పాలు చేపి, తన స్తన్యముతోనే గారాబముగా  శిశువును పెంచసాగింది. సంతానములేని వారు శిశువును ఎవరినైనా పెంచుకుంటే మాతృత్వపు అనుభూతి, మతానురాగాలు నించి, శారీరక, మానసిక పరిస్థితులు మారి, సంతానార్హత కలుగుతుంది అని మన పూర్వీకుల అనుభవపూర్వక నానుడి. కనుకనే తృత్వమునుఎరుగని ఆవిడకు కూడా పాలు చేపాయి, అదీ రాయలవారి లోకపరిశీలనా దక్షత. ఆ బాలిక క్రమక్రమంగా ఆ దంపతుల పూర్వపు న్నెములపంటగా కన్నులపంటగా పెరుగసాగింది.  

(కొనసాగింపు తరువాయి సంచికలో)

**వనం వేంకట వరప్రసాదరావు    

మరిన్ని శీర్షికలు
Stammering | నత్తి | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)