Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 5th june  to 11th june

ఈ సంచికలో >> శీర్షికలు >>

కాలసర్ప దోషం పోగొట్టే రాహు కేతు క్షేత్రం - కర్రా నాగలక్ష్మి

rahu ketu kshetram-raahoori

మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లాలోని "రాహురి "  పట్టణం , దీన్ని  రాహుకేతు క్షేత్రంగా చెప్తారు . రాహు, కేతు , శని  గ్రహ దోష నివారణార్ధం యిక్కడ పూజలు చేసుకుంటారు . కాల సర్ప దోషం వున్నవాళ్లు యిక్కడ పూజలు చేసుకొని అకాలమృత్యు దొషాలనుంచి బయట పడతారు . యిన్ని మహిమలు గల యీ క్షేత్రం గురించి తెలుసుకుందాం .

 హైదరాబాద్ నుంచి షిరిడి వెళ్ళే యాత్రీకులు యీ పట్టణం మీదుగానే  వెళ్ళవలసి వుంటుంది . యీ పట్టణం లో మహాత్మా ఫులే అగ్రికల్చరల్ విశ్వ విద్యాలయానికి , పంచదార కర్మాగారానికి పేరు పొందింది . 

అహ్మద్ నగర్ కి  39కిమి.. దూరంలో వుంది యీ రాహురి . షిరిడి సాయి బాబా ని దర్శించుకొనే భక్తులు తప్పకుండా దర్శించుకొనే మరో క్షేత్రం 'శని శింగణాపూర్ '. షిరిడి నుంచి శింగణాపూర్ వెళ్ళేటప్పుడు 

ముందుగా రాహురి వస్తుంది . రాహుకేతు క్షేత్రం రాహూరి బస్ స్టేషన్ దగ్గవున్న మార్కెట్ లోంచి వో 300 మీటర్లు వెళితే పూజాద్రవ్యాలు అమ్మే దుకాణాలు , శని పూజకి కావలసిన ద్రవ్యాలు అమ్ముకొనే చిన్న వ్యాపారులు కనిపిస్తారు . వారికి వో పక్కగా చిన్న గేటు , ఆ గేటు తీసుకొని వెళితే ఆరుబయట చిన్న చిన్న రాహుకేతు విగ్రహాలు వాటి పక్కన సింధూరం రంగులో పెద్ద రాయ రూపంలో వున్న ఆంజనేయుడు ఆపక్కనే శని విగ్రహం వుంటాయి ఆ వెనకాల కొత్తగా కడుతున్న పెద్ద హాలు , అందులో శని దేవునికి యెదురుగా ఆంజనేయుని పెద్ద విగ్రహం వుంటాయి . యిక్కడ పొద్దున్న ఆరు నుంచి సాయంత్రం యెనిమిది వరకు రాహుకేతు , శని గ్రహ దోష నివారణార్ధం పూజాది కార్య క్రమాలు నిర్వహించడానికి పూజారి వుంటారు . ప్రతి రోజు 11-30 నుంచి 12 వరకు మరల సాయంత్రం 6-30 నుంచి 7వరకు హారతి పూజ చేస్తారు . శని అమ్మవాస్య , శని త్రయోదశి , శని జయంతి విశేషంగా జరుపుతారు .

యిక్కడి స్థల పురాణం యిలా చెప్తారు . అమృత మంథనంలో అమృతం  పుట్టిన తరువాత విష్ణుమూర్తి మోహిని అవతారం దాల్చి అమృతం దేవతలకు పంచుతుండగా విష్ణుమూర్తి కపటం గ్రహించిన వొక రాక్షసుడు ( పేరు తెలీదు ) దేవతల రూపం ధరించి దేవతలా పక్కన కూర్చొని అమృతం గ్రహిస్తాడు . అదితెలుసుకున్న విష్ణు మూర్తి తన సుదర్శన చక్రం తో రాక్షసుని తల నరుకుతాడు . ఆ రాక్షసుని శరీరభాగాలు పడ్డ ప్రదేశం లో వాటిని భూ స్థాపితం చేయించేస్తాడు విష్ణుమూర్తి . శరీరం లేకపోవడంతో తల భాగం రాహువుగా తలలేని భాగం కేతువుగా ఇంద్ర సభలో స్థానం పొందేరు . అమృతం సేవించిన రాక్షసుని కళేబరాన్ని భూ స్థాపితం కావించిన ప్రదేశం కాబట్టి యీ ప్రాంతాన్ని రాహూరి (రాహువు వూరు) అని పిలువ సాగేరు . రాహుకేతువుల శరీరం భూస్తాపితం గావింపబడ్డ ప్రదేశం కాబట్టి యిక్కడ చేసే రాహుకేతు ,శని పూజలు లక్ష రెట్ల దోషనివారణ జరిగి వారి జీవిత కాలంలో మరెప్పుడూ రాహుకేతు , శని గ్రహ బాధలు కలగవని యిక్కడి స్థల పురాణం . 

యీ కోవేలని " శని మారుతి మందిర్ " అని కూడా అంటారు .

 యీ సంవత్సరం మే 18 న శని జయంతి యిక్కడ విశేషంగా జరుప బడింది . ఆ రోజు  మా దంపతులకి అక్కడకి వెళ్లి పూజలు చేసుకొనే భాగ్యం కలిగింది .

ఇప్పుడిప్పుడే యీ ప్రదేశం ప్రాచుర్యం పొందుతోంది . షిరిడి సాయిని దర్శించుకొనే భక్తులు యీ రాహుకేతు క్షేత్రాన్ని దర్శించుకొని రాహుకేతు ,శని దొషాలనుంచి విముక్తి పొందండి. 

మరిన్ని శీర్షికలు
sahiteevanam