Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

05-06-2015 నుండి 11-06-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

  

మేష రాశి :  ఈ వారం మొత్తంమీద ఉద్యోగంలో సమయం చర్చలతోనే సరిపోయే అవకాశం ఉంది. పెద్దలతో కలిసి మీరు చేపట్టిన చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. అధికారులతో మీకున్న అనుభంధం గట్టిపడుతుంది. గతంలో మీరుచేసిన పనులకు గాను నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుతారు. బంధువులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉండవు. సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. కుటుంబంలో సభ్యుల నుండి సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో తీసుకొనే నిర్ణయాలు కీలకమైన మార్పులకు అవకాశం ఇస్తాయి. సంతానం వలన ఊహించని ఖర్చులకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం సూచన.                            

 


వృషభ రాశి : ఈ వారం మొత్తంమీద మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో తడబాటు ఉంటుంది. అనవసరమైన చర్చలకు అవకాశం ఇవ్వకండి. చాలావరకు విషయాల్లో సర్దుబాటు అవసరం. సోదరసంభందమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. వారితో చర్చలకు అవకాశం ఉంది. సంతానం విషయంలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో ఒత్తిడిని పొందుటకు అవకాశం ఉంది. బంధువర్గం నుండి నూతన విషయాలు తెలుస్తాయి. పెద్దలతో మీకున్న పరిచయాల మూలాన నూతన అవకాశాలు పొందుతారు. అనుకోని ఖర్చులకు ఆస్కారం కలదు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేస్తారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి నూతన సమాచారం సేకరిస్తారు. దైవసంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నం చేయుట మంచిది.            

   

 

 


మిథున రాశి : ఈ వారం మొత్తంమీద నలుగురికి ఉపయోగ పడే ఆలోచనలు కలిగి ఉంటారు. శక్తికి మించిన పనులను చేపట్టకండి. మిత్రులతో కలిసి చేయుపనుల విషయంలో స్పష్టమైన ఆలోచన లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త. స్త్రీ / పురుష సంబంధమైన విషయాల్లో నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం అలాగే వారితో కలిసి చేసే ప్రయత్నాల్లో నిదానం అవసరం. ఆర్థికపరమైన విషయాల్లో బాగనే ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో ఇస్టంను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండుట సూచన. వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త. వ్యాపారపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు చేస్తారు. దూరప్రదేశం నుండి ఒక సమాచారం పొందుతారు. భూమిలావాదెవీల్లొ అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకోండి.             

 

 


కర్కాటక రాశి : ఈ వారం మొత్తంమీద చేపట్టిన పనులలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు చేపట్టుటకు అవకాశం ఉంది. పెద్దల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపును పొందుతారు. స్వల్పప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది, వాటికి సమయం ఇస్తారు. నూతన పరిచయాలు కలుగుతాయి, వారితో కలిసి నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. పెద్దలతో లేదా అధికారులతో మాటపట్టింపులకు పోకండి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశం కలదు జాగ్రత్త. సోదరులతో మీరు చేసిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. మీయొక్క ఆలోచనల్లో తెలియని ఆందోళన అలాగే ఒత్తిడిని కలిగి ఉంటారు. సంతానం మూలాన సంతోషాన్ని పొందుతారు వారి మూలాన గుర్తింపు లభిస్తుంది.             

సింహ రాశి : ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు పొందుతారు. సంతానపరమైన విషయాల్లో కీలకమైన మార్పులు కలుగుతాయి. మీయొక్క ఆలోచనలు అలాగే దృష్టిని సంతానం పైన సారించుట మంచిది. రుణసంబందమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు మొదట్లో ఎదురయ్యే అవకాశం ఉంది. చివరినిమిషంలో ధనం సర్దుబాటు అవుతుంది. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం కలదు కావున జాగ్రత్తగా వ్యవహరించుట మేలు. అధికారులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. స్త్రీ / పురుష సంబం ధమైన విషయాల్లో ఏమాత్రం ఏమరపాటు కలిగిఉన్న సమస్యలు పెరుగుతాయి. సోదరవర్గం నుండి విలువైన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. సామజిక సేవారంగంలో గుర్తింపును పొందే ఆస్కారం కలదు కావున ఈ విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళడం ఉత్తమం.        

 

 

    
కన్యా రాశి :  ఈ వారం మొత్తంమీద ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంభ సభ్యులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు. అధికారులతో చర్చాసంభందమైన విషయాల్లో పాల్గొనేటప్పుడు నిదానంగా వ్యవహరించట సూచన. సంతానం మూలాన ఊహించని ఖర్చులను పొందుతారు. గతంలో మీరు ఇచ్చిన రుణం తాలూకు విషయంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చును. దైవసంభందమైన విషయాల్లో సమయం ఇవ్వడం అనేది సూచన. వ్యతిరేకవర్గం నుండి ఇబ్బందులు వస్తాయి వాటిని సమయస్పూర్తితో ఎదుర్కొనే అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల నుండి మీకు నూతన అవకాశాలు వస్తాయి,వాటిని అందిపుచ్చుకొనే ప్రయత్నం చేయండి.              

    

తులా రాశి : ఈ వారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. ఉద్యోగంలో లేక వృత్తిస్థానంలో నిదానంగా వ్యవహరించుట సూచన. కోరుకున్న బదిలీలకు అవకాశం ఉంది ప్రయత్నం చేయండి. పెద్దలతో కలిసి పనిచేసే సమయంలో వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోండి. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు పెద్దగా కలిసి రాకపోవచ్చును కావున అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి. కుటుంబభాద్యతలు పెరుగుతాయి. మీయొక్క మాటతీరు మూలాన కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త. స్వల్పఅనారోగ్యసమస్యలు కలుగుతాయి కావున తగిన జాగ్రత్తలు తీసుకోండి. బంధువులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళుటకు అవకాశం ఉంది.      

 

 .వృశ్చిక రాశి  :  ఈ వారం మొత్తంమీద చిన్న చిన్న పనులను పూర్తిచేయుటకు సమయాన్ని ఇస్తారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి,నలుగురిని కలుపుకొని వెళ్ళుట సూచన. కుటుంబంలో  పెద్దల నుండి వచ్చు సూచనలు మిమ్మల్ని ఇరకాటంలో పడవేసే ఆస్కారం ఉంది. ఇష్టమైనవ్యక్తులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం ఉంది. రాజకీయపరమైన విషయాల్లో అనుకూలమైన కాలం. మీ పై అధికారులతో కలిసి చేసిన ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. ప్రయాణాలు  చేయునపుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించుట అవసరం. కొన్ని కొన్ని విషయాల్లో అవతలి వారి ఆలోచనలు మిమ్మల్ని కాస్త మానసికపరమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలుచెస్ విషయంలో నిర్ణయాలు వాయిదావేయుట అవసరం.        

 

 


ధనస్సు రాశి  : ఈ వారం మొత్తంమీద నూతన పరిచయాలకు అవకాశం ఉంది,వారితో సమయాన్ని గడుపుతారు. మీయొక్క ఆలోచనలు కొన్ని కొన్ని సార్లు మిమ్మల్నే ఆత్మరక్షణలో పడవేసే అవకాశం ఉంది జాగ్రత్త. నూతన నిర్ణయాల విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేరనడుచుకోండి. పనిలో ఒత్తిడి ఉంటుంది అందుకనే సమయపాలన పాటించుట మరియు నలుగురితో కలిసి పనిచేయుట వలన మేలుజరుగుతుంది. కుటుంభంలో పెద్దలతో చర్చలకు అవకాశం ఇవ్వకండి. అవతలివారి ఆలోచనలు తెలుసుకొని వాటికి అనుగుణంగా నడుచుకొనుట వలన కూడా మేలుజరుగుతుంది. స్త్రీ / పురుష సంబంధమైన విషయాలలో ఖర్చులను పెట్టుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకోని మార్పులకు అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి మార్పును స్వాగతించుట అవసరం.              

         

మకర రాశి :  ఈవారం మొత్తంమీద రాజకీయరంగాల్లో ఉన్నవారికి నూతన అవకశాలు లభిస్తాయి. కాకపోతే నోటిని అదుపులో ఉంచుకోకపోతే మాటపడవలసి రావోచ్చును జాగ్రత్త. నూతన ప్రయత్నాలు మొదలుపెడతారు. కుటుంబసభ్యుల సహకారం ఉండుట వలన ఆర్థికపరమైన విషయాలలో సమస్యలు ఏర్పడకపోవచ్చును. వివాదాలకు అవకాశం ఇవ్వకండి నలుగురిని కలుపుకొని వెళ్ళే అలవాటు మూలాన లబ్దిని పొందుతారు. సంతానం మూలాన ఖర్చులు అయ్యే అవకాశం ఉంది. వారితో కలిసి నూతన పనులను ఆరంభిస్తారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది ,వాటికి సమయం ఇస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దల ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట అదేవిధంగా సంప్రదాయపద్దతులను పాటించుట వలన మేలుజరుగుతుంది.        

 

 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద బంధువుల నుండి ఊహించిన సమాచారం పొందుతారు. వారితో చర్చల్లో పాల్గొనకపోవడం అనేది సూచన. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను ఆరంభించే అవకాశం ఉంది. జీవితభాగస్వామితో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మేలుజరుగుతుంది. సమయానికి భోజనం చేయుట సూచన. మానసికంగా కొంత ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి వాటికి సమయాన్ని ఇస్తారు. వాహనముల వలన ఊహించని ఖర్చులు కలుగుతాయి జాగ్రత్త. కొన్ని కొన్ని విషయాలలో మాట పట్టువిడుపు ఉండుట వలన కొంత లాభదాయకంగా ఉంటుంది. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి.                           

  

మీన రాశి : ఈవారం మొత్తంమీద తల్లి తరుపు బంధువుల నుండి ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. రుణపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఉద్యోగంలో మీరు  తలపెట్టిన పనుల వలన నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు. సంతానపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. పెద్దలతో చేయు చర్చలలో వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచిది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. వ్యాపారపరమైన పరమైన విషయాల్లో ఊహించని విధంగా నూతన సహకారం లభిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయుట వలన మేలుజరుగుతుంది. చిన్న చిన్న నిరాశలు తప్పక పోవచ్చును సర్దుబాటు అవసరం. కుటుంబసభ్యుల నుండి సహకారం చక్కగా లభిస్తుంది. మిత్రులతో నూతన పనులను ఆరంభిస్తారు.          

టి. శ్రీకాంత్ 

వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
rahu ketu kshetram-raahoori