Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
character artist so what?

ఈ సంచికలో >> సినిమా >>

లక్కు తోక తొక్కిన సోనాల్‌ చౌహన్‌

sonalichouhan so lucky

లక్‌ ఎవరికి ఎలా ఏ టైమ్‌లో తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేం. తెలుగులో ఇక అవకాశాలు రావనుకున్న టైమ్‌లో సోనాల్‌ చౌహాన్‌కి ‘లెజెండ్‌’ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అంతకు ముందు ‘హ్యాపీడేస్‌’ ఫేం రాహుల్‌ హీరోగా నటించిన ‘రెయిన్‌బో’ అనే సినిమాలో నటించింది సోనాల్‌ చౌహన్‌. ‘రెయిన్‌బో’ ఫ్లాప్‌ అవడంతో సోనాల్‌ చౌహన్‌ తెలుగు సినిమాని దాదాపు మర్చిపోయిందేమో. ఆ టైమ్‌లో ‘లెజెండ్‌’ సినిమా సోనాల్‌ చౌహన్‌ కెరీర్‌లో పెద్ద మలుపు.

అదృష్టం బాలయ్య రూపంలో తలుపు తట్టేసరికి, తెలుగులో సత్తా చాటుకోవచ్చని ఉబలాటపడిరది సోనాల్‌. ఆమె సంతోషానికి తగ్గట్టే ‘లెజెండ్‌’ పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత రామ్‌ హీరోగా వచ్చిన ‘పండగ చేస్కో’ సినిమాలో కూడా సోనాల్‌కి ఛాన్సొచ్చింది. ‘పండగ చేస్కో’ కూడా సోనాల్‌కి మంచి కిక్కే ఇచ్చింది. ఇక అక్కడినుంచీ సోనాల్‌కి అవకాశాలు వరుసగా వస్తున్నాయట. తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాననీ, మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల రుణం తీర్చుకుంటానంటోంది సోనాల్‌ చౌహన్‌.

మరిన్ని సినిమా కబుర్లు
can bunny hits more 50