Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: ఆంధ్రా పోరీ
తారాగణం: ఆకాష్‌ పూరి, ఉల్కా గుప్తా, శ్రీకాంత్‌ అయ్యంగర్‌, ఈశ్వరిరావు, శ్రీముఖి, అరవింద్‌ కృష్ణ, ఉత్తేజ్‌, డిఎంకె, డా.కృష్ణస్వామి, అభినయ తదితరులు.
చాయాగ్రహణం: ప్రవీణ్‌ వనమాలి
సంగీతం: డా.జె.
నిర్మాణం: ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌
దర్శకత్వం: రాజ్‌ మాదిరాజు
నిర్మాత: రమేష్‌ ప్రసాద్‌
విడుదల తేదీ: 5 జూన్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
పేద కుటుంబంలో పుట్టి, ఎందుకూ పనికిరాడు అన్పించుకునే నిజామాబాద్‌కి చెందిన నర్సింగ్‌ యాదవ్‌ (ఆకాష్‌ పూరి) కొన్ని కారణాలతో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతాడు. ఓ థియేటర్‌లో పనిచేస్తున్న సమయంలో నర్సింగ్‌కి ప్రశాంతి (ఉల్కా గుప్తా) తారసపడ్తుంది. ఇద్దరికీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన ప్రశాంతిని ప్రేమించిన నర్సింగ్‌, తన ప్రేమను నిలబెట్టుకున్నాడా? ఎందుకూ పనికిరాడనుకున్న నర్సింగ్‌ విషయంలో ప్రశాంతి కుటుంబం ఎలా స్పందించింది? అనేవి తెరపై చూస్తేనే తెలుస్తాయి.

మొత్తంగా చెప్పాలంటే
హీరోగా పూరి ఆకాష్‌కి ఇది తొలి చిత్రం. అయితే బాల నటుడిగా పలు సినిమాలు ఇప్పటికే చేసిన అనుభవంతో ఆకాష్‌ చాలావరకు ఈజ్‌తోనే చేయగలిగాడు. బాధ్యతలేని కుర్రాడిగా చక్కగా నటించిన ఆకాష్‌, కొన్ని సీన్స్‌లో తేలిపోయాడు. హీరో పాత్రకు అవసరమైన బాడీ లాంగ్వేజ్‌ ఒక్కటీ లోటు. పూరి సినిమాల్లో హీరోలు డిఫరెంట్‌గా ఉంటారు. దానికి అలవాటు పడ్డ ఆడియన్స్‌ని ఆకాష్‌ తనవైపుకు తిప్పుకోవాలంటే కొంచెం కష్టపడాలి. డాన్సుల్లోనూ ఈజ్‌ ప్రదర్శించాల్సి ఉంది.

ఉల్కా గుప్తా క్యూట్‌గా ఉంది. ఈమె కూడా బాలనటిగా పనిచేసిన అనుభవం కలిగి ఉంది. అయితే హీరోయిన్‌గా తొలి సినిమాతో ఆకట్టుకోలేకపోయింది. తెలుగు సినిమా హీరోయిన్‌ అంటే కొన్ని లెక్కలున్నాయి. ఆ లెక్కలకు తగ్గట్టు ఉల్కా గుప్తా తనను తాను మార్చుకోవాల్సి ఉంది. హీరోయిన్‌ తండ్రి పాత్రలో శ్రీకాంత్‌ అయ్యంగార్‌ బాగా చేశాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదన్పించారు. ఎవరి గురించీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయింది.

ఈ కథ తెలుగు ప్రేక్షకులకు బాగా అలవాటైపోయిందే. అలాంటప్పుడు కాస్త కొత్తగా చెపితే బాగుండేది. దర్శకుడు ఈ విషయంలో విఫలమయ్యాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ అవసరానికి తగ్గట్టు జోడిస్తే, పాస్‌ మార్కులు పడతాయన్న లాజిక్‌నీ దర్శకుడు పక్కన పెట్టాడు. ప్రవీణ్‌ వమనాలి సినిమాటోగ్రఫీ ఓకే. మ్యూజిక్‌ సినిమాకి ప్లస్‌ అవలేదు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ గురించీ చెప్పుకోడానికి ఏమీ లేదు. ఇలాంటి సినిమాల్లో డైలాగ్స్‌ కీ రోల్‌ పోషిస్తాయి. అందులోనూ మంచి మార్కులు పడలేదు. ఎడిటింగ్‌ లోపాలూ ఉన్నాయి. నిర్మాణ విలువల పరంగా ఓకే. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ ఓ మోస్తరుగానే ఉన్నాయి.

ఫీల్‌ గుడ్‌ సినిమాలకి నేటివిటీ చాలా ఇంపార్టెంట్‌. రీమేక్‌ సినిమా అయినా దానికి తాలూకు డల్‌నెస్‌ కనిపించకుండా జాగ్రత్తపడాలి. ఫస్టాఫ్‌ స్లోగా నడిస్తే, దాంతో పోటీ పడి సెకెండాఫ్‌ కూడా స్లోగానే నడిచింది. ఫీల్‌గుడ్‌ మూవీ అంటే డల్‌గానే ఉండాలని దర్శకుడు అనుకోవడమూ పొరపాటే. ప్రయత్నం మంచిదే అయినా, దాన్ని ఆడియన్స్‌ మెచ్చేలా చేస్తేనే ఆ ప్రయత్నానికి మంచి స్పందన వస్తుంది. డైలాగ్స్‌, పిక్చరైజేషన్‌, టేకింగ్‌ ఇలా దేంట్లోనూ దర్శకుడు సినిమాని నిలబెట్టే ప్రయత్నం చేయలేకపోయాడు. టార్గెట్‌ ఆడియన్స్‌ అయిన యూత్‌ని కూడా ఎట్రాక్ట్‌ చేయలేదు ఈ మూవీ.

ఒక్క మాటలో చెప్పాలంటే
ఆంధ్రా పోరీ అంత గొప్పగా ఏమీ లేదు

అంకెల్లో చెప్పాలంటే: 2.5/5

మరిన్ని సినిమా కబుర్లు
interview