Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిష్యం - విజ్ఞానం - శ్రీకాంత్

  శ్రీ గురుభ్యోనమః

గ్రహాలు -జ్యోతిషం

మన పూర్వీకులు అలాగే ఋషులు గ్రహాలను కేవలం ముడిపదార్థాలుగా లేదా ఒక ఖగోలంగా మాత్రమే చూడలేదు. పాశ్చాతులు వీటినే కదిలే నక్షత్రాలు గా గుర్తించారు. గ్రహం అనేది వాస్తవంగా గ్రీకు పదం. గ్రహం అనగా సంచారి అని అర్థం. గ్రహాలు కూడా నిర్దిష్టమైన కక్షలో సూర్యుని చుట్టూ నిరంతరం సంచరిస్తూనే ఉంటాయి. నాసా వారి ప్రకారం గ్రహం అంటే పెద్ద ఆకారాన్ని కలిగి ఉండి,సూర్యుని చుట్టూ నిర్దిష్టమైన కక్షలో తిరుగుతూ గురత్వాకర్షణ కలిగి ఉండాలి. వీటి గురుంచి మన భారతీయఋషులు చాలావరకు అవిశ్రాంతంగా కృషి చేసి వాటి ప్రభావం మానవుల పైన అలాగే ప్రకృతి పైన ఉన్నది అని తేల్చారు.

శని :-

శనిగ్రహం సూర్యుని సూర్యుని నుండి దూరంలో ఆరవ గ్రహం . ఈ గ్రహానికి తొమ్మిది వలయాలు అలాగే మూడు అర్దవృత్తాకారంలో ఉన్న చాపాన్ని కలిగి చూడటానికి చాలా అందంగా ఉండే గ్రహం. గ్రహాల్లో రెండవ అతిపెద్ద గ్రహంగా చెప్పుకోవచ్చును. శనిగ్రహం 62 చంద్రులను కలిగి ఉంది. అధికారికంగా 53 ను గుర్తించారు. అనేక లోహాల మిశ్రమంను కలిగి ఉంది. ముఖ్యంగా ఇనుము,నికెల్,సిలికాన్ అలాగే అక్ష్సిజెన్ లను కలిగి ఉంది. భూమి కన్నా ఎన్నోరెట్ల అధికమైన వ్యాసార్థాన్ని కలిగి ఉంది. అలాగే హైడ్రోజెన్ ,హీలియం లతో కూడి ఉన్నది. శనిగ్రహం మీద అధికమైన గాలులు ఏర్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలాగే అధికమైన సాంద్రతను కలిగి ఉంటుంది. శనిగ్రాహం యొక్క ఆయస్కంత క్షేత్రం కూడా అధికమైన బలాన్ని కలిగి ఉంటుంది. శనిగ్రహం యొక్క వృత్తాలను మనం టెలిస్కోప్ ద్వార చూసే అవకాశం కలదు. సూర్యునికి గురుగ్రహంకు ఎంత దూరమో ,గురుగ్రహానికి శనికి అంతే దూరం. శనిగ్రహం తన చుట్టూ తను తిరగడానికి పట్టేకాలం పదిగంటలు అలాగే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టేకాలం ఇరవైతొమ్మిది సంవత్సరాల సమయం పడుతుంది. అత్యంత నిదానంగా పరిభ్రమణం చేసే గ్రహంగా అనుకోవచ్చును.

జ్యోతిషంలో శనిగ్రహం:-

రోమన్లు శనిగ్రహాన్ని శాటర్న్ అంటారు. రోమన్ పురాణాల ప్రకారం వీరిని పరిపాలించాడని అలాగే శనిగ్రహం చాలామంచి దేవత అని వీరి నమ్మకం. వీరిప్రకారం వ్యసాయానికి అధిదేవత. మన భారతీయ పురాణాల ప్రకారం శనిగ్రహాన్ని సూర్యుని కుమారునిగా చెప్పబడినది. సూర్యునికి,ఛాయాదేవికి కలిగిన కుమారుడు కనుకే చయాపుత్ర అని అంటారు. శనిగ్రహం మకరరాశికి,కుంభరాశికి అధిపతి మేషంలో నీచను పొందుతాడు. శుక్రక్షేత్రం అయిన తులలో ఉచ్చస్థితిని పొందుతాడు. శనిగ్రహాన్ని న్యాయానికి అధిపతిగా వర్ణిస్తారు. ముఖ్యంగా భారతీయ జ్యోతిషంలో శనిగ్రహాన్ని చాలా ప్రత్యేకంగా చూడటం జరిగింది అదేవిధంగా అత్యంత  ప్రభావంతమైన గ్రహంగా చెప్పుకోవచ్చును. శని ఒక రాశిలో 2-1/2 సంవత్సరాలు ఉంటాడు. ఎవరి రాశికి 12,1,2 స్థానాల్లో సంచరించే సమయంలో ఆ జాతకునికి ఏలినాటి శని ప్రభావం ఉంటుంది అని తెలియజేసింది జ్యోతిషశాస్త్రం.

శనిగ్రహం ఆయుర్దాయం, మరణం,రోగం,సేవ,ముసలితనం,మురికి గుడ్డలు,ఎముకలు,నాడీమండలం,విగ్రహనిర్మాణం, శ్రమజీవులు మొదలైన వాటికి ఆధిపత్యం  వహిస్తాడు. వ్యాధుల విషయానికి వస్తే క్షయవ్యాధి,దీర్ఘకాలిక వ్యాధులు,కాన్సర్ వ్యాధి, కీళ్ళవాతం ,పుప్పిపన్ను ,  పోలియో . అంగలోపం మొదలైన వాటిని తను దుస్థానంలో ఉన్నపుడు కలిగిస్తాడు. నేను వ్యక్తిగతంగా భావిస్తున్నది శనిగ్రహం యొక్క  ప్రసన్నత చాలా సులువుగా చేసుకోవచ్చును ఎలా అనగా న్యాయానికి అధిపతి కావున ధర్మబద్ద జీవనం కొనసాగిస్తే న్యాయద్దంగా  ఉంటె తన ప్రసన్నత మనకు లభిస్తుంది. 

మరిన్ని శీర్షికలు
weekly horoscope12 th june  to 18th june