Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
allu shirsh with six pack

ఈ సంచికలో >> సినిమా >>

శ్రీకాంత్‌, నిఖిత ‘టెర్రర్‌’

srikant, nikhita terror

కామెడీ, పాటలు లేకుండా ఏ సినిమా అయినా వస్తే అది బాక్సాఫీస్‌ వద్ద నెగ్గడం కష్టం. కానీ హీరో శ్రీకాంత్‌ ఓ ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. పాటలు లేకుండా, కామెడీకి అవకాశం లేకుండా డిఫరెంట్‌ జోనర్‌లో ‘టెర్రర్‌’ అనే సినిమా చేస్తున్నాడు. ఇలాంటి ప్రయోగానికి అటెంప్ట్‌ చేయడమే పెద్ద రిస్క్‌. రిస్క్‌ చేయాలంటే గట్స్‌ కావాలి. ఆ గట్స్‌ తమకున్నాయనీ, సినిమాపై నమ్మకంతోనే ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టామంటున్నాడు హీరో శ్రీకాంత్‌. ఈ చిత్రంలో శ్రీకాంత్‌ సరసన ‘హాయ్‌’ ఫేం నిఖిత హీరోయిన్‌గా నటిస్తోంది. ‘టెర్రర్‌’ అనేది పోలీస్‌ కథ అనీ, డిఫరెంట్‌గా ఉంటుందని అందరూ చెప్పే మాటే అయినా, కొత్తగా ఈ సినిమాని తాము చేస్తున్నామన్నది నూటికి నూరుపాళ్ళు నిజమని దర్శకుడు సతీష్‌ కాశెట్టి చెప్పాడు. పోలీస్‌ గెటప్‌లో శ్రీకాంత్‌ అద్భుతమైన పెర్ఫామెన్స్‌ ఇచ్చారని నిర్మాత అన్నారు. అఖండ భారత క్రియేషన్స్‌ పతాకంపై షేక్‌ కరీమ్‌ సమర్పణలో షేక్‌ మస్తాన్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మరిన్ని సినిమా కబుర్లు
new heroin with varun