Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
new heroin with varun

ఈ సంచికలో >> సినిమా >>

హన్సికకి రోమియో ఎవరూ దొరకలేదట

No romeo got hansika

హన్సికను ఇప్పుడు అంతా ‘హాయ్‌ జూలియట్‌’ అంటున్నారట. ‘జయం’ రవి హీరోగా తమిళంలో నటించిన ‘రోమియో జూలియట్‌’ సినిమాలో హన్సిక జూలియట్‌ పాత్రని పోషించడమే ఇందుకు కారణమట. ఇప్పటివరకు చేసిన గొప్ప సినిమాల్లో ఒకటిగా ‘రోమియో జూలియట్‌’ నిలిచిపోతుందని అంటుంది హన్సిక. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా వీలు చిక్కినప్పుడల్లా సినిమాలు చేస్తూ లక్కీ హీరోయిన్‌ అనిపించుకుంటున్న హన్సిక ఇంకా ఎవరితోనూ ప్రేమలో పడలేదట. ప్రేమించేందుకు తగిన వయసు ఉన్నా, కెరీర్‌లో బిజీగా ఉండటంతో ప్రేమించడానికి టైమ్‌ దొరకడంలేదని హన్సిక చెప్పింది. ‘హాయ్‌ జూలియట్‌ నీ రియల్‌ లైఫ్‌ రోమియో ఎక్కడ?’ అని ప్రశ్నిస్తే, ఎక్కడో పుట్టే ఉంటాడు కదా, కానీ రోమియో, జూలియట్‌ నిజంగా కలవాలంటే చాలా సమయం పడుతుందని నవ్వేస్తూ చెప్పింది హన్సిక. సినీ రంగంలో ఎందరితోనో ఎఫైర్స్‌ నడిపిందంటూ హన్సికపై గాసిప్స్‌ ఉన్నాయి. వాటి గురించి హన్సిక స్పందిస్తూ, గాసిప్స్‌ని ఎంటర్‌టైన్‌మెంట్‌లానే చూడాలని చెబుతుంది.

మరిన్ని సినిమా కబుర్లు
very funny chuttaalabbai