Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
get ready for movie mela

ఈ సంచికలో >> సినిమా >>

కమలిని వస్తానంటే వద్దంటారా?

nobady says no for kamalini

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు తెరపై చెరగని ముద్ర వేసింది కమలినీ ముఖర్జీ. ‘ఆనంద్‌’ సినిమాని తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అద్భుతమైన నటనతో, అచ్చంగా పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించే కమలినీ ముఖర్జీ, తగిన అవకాశాల కోసం ఎదురుచూస్తోందిప్పుడు. ఏ పాత్రలో అయినా నటించడానికి సిద్ధం అని చెప్పడమే కాకుండా, ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో శ్రీకాంత్‌ సరసన నటించింది ప్రేక్షకుల్ని మెప్పించింది.

మంచి అవకాశాల కోసం చూస్తున్నానంటోంది కమలినీ ముఖర్జీ. తమిళంలో ఓ సినిమాలో చేస్తున్న కమలినీ ముఖర్జీ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తాను తప్ప, అవకాశాలు వస్తున్నాయి కదా అని అన్ని ఆఫర్స్‌నీ ఒప్పుకోలేనని చెబుతుంది. తెరపై ఆమ నటన, ఆమె స్క్రీన్‌ ప్రెజెన్స్‌ అన్నీ బాగుంటాయి. అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే, ఏ పాత్రలో అయినా ఒదిగిపోగలదు కమలినీ ముఖర్జీ. మంచి అవకాశాల కోసం ఎదురు చూడటంతోపాటు, వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటే తెలుగు తెరపై కమలినీ కొత్త పాత్రల్లో వెలిగిపోవచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
but ok, samanta had big break