Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar double dhamaka

ఈ సంచికలో >> సినిమా >>

నిరాశ పర్చినా ఫస్టాఫ్‌ బాగానే ఉంది

first of not so bad

2015లో తొలి అర్థభాగం పూర్తయిపోయింది. సినీ రంగం ఈ అర్ధభాగంలో చెప్పుకోదగ్గ విజయాల్నే సొంతం చేసుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. అయితే వేసవి మాత్రం అభిమానుల్ని పూర్తిగా నిరాశపరిచింది. రావాల్సిన సినిమాలు టైమ్‌కి రాకపోవడంతో సగటు సినీ అభిమాని ఎంటర్‌టైన్‌మెంట్‌ని మిస్‌ అయ్యాడు. సినీ పరిశ్రమ కూడా చాలా ఆదాయాన్ని కోల్పోయింది. ఈ అర్థభాగంలోనే విడుదలవ్వాల్సిన ‘రుద్రమదేవి’, ‘బాహుబలి’, ‘కిక్‌’ సినిమాలు విడుదల కాకపోవడంతో సినీ అభిమానులు నిరాశ చెందారు. ఆ సినిమాలు కూడా వచ్చి ఉంటే ఫస్టాఫ్‌ చాలా కలర్‌ఫుల్‌గా ఉండేదే. పెద్ద సినిమాల్లో ‘గోపాలగోపాల’, ‘పటాస్‌’, ‘టెంపర్‌, ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’, ‘జిల్‌’ సినిమాలు అభిమానుల్ని అలరించాయి. చిన్న సినిమాల్లో ‘సూర్య వర్సెస్‌ సూర్య’, ‘జ్యోతిలక్ష్మి’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ఆకట్టుకోగా, ‘పండగచేస్కో’ సినిమాకి టాక్‌ ఎలా ఉన్నా వసూళ్ళు రాబట్టింది. ఫస్టాఫ్‌లో రావాల్సిన సినిమాలు రాకపోవడంతో సెకెండాఫ్‌లో పెద్ద సినిమాల సందడి కొద్ది రోజుల్లో మొదలవుతుందని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సెకెండాఫ్‌లో ‘బాహుబలి’ రూపంలో ఇండస్ట్రీ హిట్‌ వస్తుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. జులై 10న ఈ సినిమా రానుంది.

మరిన్ని సినిమా కబుర్లు
sudheer babu getton step by step