Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sudheer babu getton step by step

ఈ సంచికలో >> సినిమా >>

సింగర్‌గా బాలయ్య హీరోయిన్‌?

radhika apte not a heroin  singer  also

బాలీవుడ్‌ భామ రాధిక ఆప్టే తెలుగులో బాలకృష్ణతో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాలు చేసింది. ‘లెజెండ్‌’, ‘లయన్‌’ సినిమాల్లో నటించిన ఈ అందాల భామ, ఓ షార్ట్‌ ఫిలింలో అసభ్యకరంగా నటించి వార్తల్లోకెక్కింది. ఏం చేసినా అది నటనలో భాగమేనని చెబుతూ, దాన్ని వివాదం చేసి తద్వారా కొందరు పబ్లిసిటీ పొందాలని చూశారంటుంది రాధిక ఆప్టే. ఏం చేసినా అందరూ తన గురించి చర్చించకునేలా ఉండాలనుకునే రాధిక, హిమాలయాల్లో ట్రెక్కింగ్‌ కోసం ఓ స్నేహబృందంతో కలిసి వెళ్ళింది. తిరిగి వచ్చాక సినిమాల్లో బిజీ అవుతానని అంటుంది ఈ అందాల భామ. యాక్టింగే కాకుండా రాధికలో సింగింగ్‌ టాలెంట్‌ కూడా ఉందట. చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న సంగీతం, పాటలు పాడటం ఇంకా తనకు గుర్తుందనీ, ఈ ట్రెండ్‌కి తగ్గట్టుగా సంగీతం, సింగింగ్‌ క్లాస్‌లకు వెళ్ళి పాటల ప్రపంచంలో తన వాయిస్‌ని వినిపించాలనుకుంటున్నానని రాధిక ఆప్టే చెప్పింది. రాధిక తదుపరి బాలీవుడ్‌ చిత్రం ‘బాంబారియా’ సెట్స్‌పైకి వెళ్ళవలసి ఉంది. ఇది కాకుండా, తెలుగు తమిళ భాషల్లో కొన్ని సినిమాలు చర్చల స్థాయిలో ఉన్నాయట.

మరిన్ని సినిమా కబుర్లు
jyotilakshmi was reached goal