Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: టైగర్‌
తారాగణం: సందీప్‌ కిషన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, సీరత్‌ కపూర్‌, కాశి విశ్వనాథ్‌, బాబీ పర్వేజ్‌, ప్రవీణ్‌, తనికెళ్ళ భరణి, తాగుబోతు రమేష్‌,  తదితరులు
చాయాగ్రహణం: చోటా కె నాయుడు
సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌
నిర్మాణం: ఎన్‌విఆర్‌ సినిమా
దర్శకత్వం: వి.ఐ. ఆనంద్‌
నిర్మాత: ఎన్‌.వి. ప్రసాద్‌
విడుదల తేదీ: 26 జూన్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
విష్ణు (రాహుల్‌ రవీంద్రన్‌), జై (సందీప్‌ కిషన్‌) అనాధాశ్రమంలో పెరుగుతారు. చిన్నప్పటినుంచీ ఇద్దరూ మంచి స్నేహితులు. విష్ణుని జై తన స్నేహితుడిగా భావిస్తే, జై తలనొప్పి అనుకుంటాడు విష్ణు. విష్ణు ఆ అనాధాశ్రమం నుంచి వెళ్ళిపోతాడు వేరొకరు దత్తత తీసుకోవడంతో. దాంతో విష్ణుకి జై దూరమవుతాడు. చాలా కాలం తర్వాత గంగ (సీరత్‌ కపూర్‌) ఓ కాలేజీ ఫెస్టివల్‌కి హాజరవుతుంది. అక్కడే ఆమె విష్ణు గర్ల్‌ఫ్రెండ్‌గా అందరి దృష్టిలోనూ పడుతుంది. తర్వాత ఇద్దరి మధ్యా ప్రేమ చిగురిస్తుంది. హైద్రాబాద్‌లో గంగకి ఉద్యోగం వస్తుంది. అయితే గంగ, విష్ణు ప్రేమ విషయం తెలిసి, గంగ గార్డియన్‌ ఆమెను కాశి తీసుకెళ్ళిపోతాడు. అయితే గ్రామ పెద్ద, విష్ణు మరియు గంగని చంపేయాలని నిర్ణయిస్తాడు. ఈ విషయం టైగర్‌ అలియాస్‌ జైకి తెలుస్తుంది. అప్పుడు జై ఏం చేస్తాడు? స్నేహితుడిని ఆపద నుంచి ఎలా కాపాడాడు? అన్నది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే
సందీప్‌ కిషన్‌ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో, డాన్సుల్లో, సెంటిమెంట్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. రాహుల్‌ రవీంద్రన్‌ డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో ఓకే అనిపిస్తాడు. ‘రన్‌ రాజా రన్‌’ ఫేం సీరత్‌కపూర్‌ గ్లామర్‌తోనూ నటనతోనూ తన ఉనికిని చాటుకుంది. ఆమె కన్పిస్తుంతసేపూ ఆడియన్స్‌ మెస్మరైజ్‌ అవుతారు.

తాగుబోతు రమేష్‌ నవ్వులు పూయించాడు. మిగతా కమెడియన్లలో చిత్రం శ్రీను, తదితరులు ఆకట్టుకుంటారు. తనికెళ్ళ భరణిని సరిగ్గా వాడుకోలేకపోయారు. కాశి విశ్వనాథ్‌, బాబీ పర్వేజ్‌ కాస్సేపు నిడివిగల పాత్రలకే పరిమితమయ్యారు. మిగతా పాత్రధారులంతా తమ పరిధి మేర ఫర్వాలేదన్పించారు.

కథ ‘ఆర్య’ సినిమాని పోలి ఉన్నట్లనిపిస్తుంటుంది. కథ పాతదే అనిపించినప్పుడు కథనం మీద దర్శకుడు ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుంది. కథనంలో వేగం చూపించడంలో దర్శకుడు సఫలం కాలేకపోయాడు. డైలాగ్స్‌ బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి తగ్గట్టుగా పనిచేశాయి. ఎడిటింగ్‌ క్రిస్ప్‌గా ఉంటే బాగుండుననిపిస్తుంది.

ఫస్టాఫ్‌ సోసోగా సాగిపోతుంది. సెకెండాఫ్‌ కూడా అంతే. యాక్షన్‌ లేదా రొమాన్స్‌ లేదా థ్రిల్లింగ్‌ కంటెంట్‌కి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడిస్తే ఆ సినిమా సక్సెస్సే. ఫార్ములా అని కాదుగానీ, చాలామంది దర్శకులు ఫాలో అవుతున్న ట్రెండ్‌ ఇది. పాత కథ, కొత్త కథ ఏదైనా ఇలాంటి ఫార్ములాస్‌తో సక్సెస్‌ అవుతున్నాయి. అయితే ఇక్కడ దర్శకుడు ఫార్ములానీ ఫాలో అవక, కొత్తదనం చూపక ప్రోడక్ట్‌ని జస్ట్‌ ఓకే అనిపించాడు తప్ప, ఆడియన్స్‌ని మెప్పించలేకపోయాడు. సందీప్‌ కిషన్‌ పెర్ఫామెన్స్‌, సీరత్‌కపూర్‌ గ్లామర్‌, సినిమాటోగ్రఫీ, కొన్ని పాటలు, కొన్ని సీన్స్‌ సినిమాలో ఆడియన్స్‌ని లీనం చేసినా, ఓవరాల్‌గా సినిమా అంచనాల్ని అందుకోలేకపోతుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే
జస్ట్‌ సోసోగా సాగిపోయే టైగర్‌

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
interview