Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
tall in class

ఈ సంచికలో >> సినిమా >>

అనుష్క అందానికి ఇవే కారణం

reasons for anushka's beauty

అందం, క్యూట్‌నెస్‌, మంచి పర్సనాలిటీ అంటే గుర్తొచ్చేవి అనుష్క. అయితే తాను ఇంత అందంగా, ఆకర్షణీయంగా ఉండడానికి కారణం తను తీసుకునే ఆహార నియమాలేనని చెబుతుంది అనుష్క. తను తీసుకునే ఆహారం ఏమైనా సరే టైం టు టైం తీసుకుంటుందట. ఎక్కువగా బరువు పెరగడానికైనా, తగ్గడానికైనా సహజమైన పద్దతులే పాటిస్తాను అంటోంది.

కూరగాయలూ, పండ్లూ, సలాడ్లూ, జ్యూస్‌లు ఎక్కువగా తన ఆహారంలో ఉండేలా చూసుకుంటుందట. అల్పాహారంలో ఎక్కువగా బ్రెడ్‌, తేనె కలిపి తీసుకుంటుందట. తేనె తన శరీరాన్ని అనారోగ్యం పాలు కాకుండా ఉంచడమే కాకుండా చర్మం ముడతలు పడకుండా మృదువుగా ఉంచుతుంది అని చెబుతుంది. ఇక వ్యాయామం విషయానికొస్తే అది తన జీవితంలో ముఖ్యమైన భాగం అయిపోయందంటుంది. ఎంత బిజీగా ఉన్నా రోజులో కనీసం ఒక అరగంటైనా యోగా చెయ్యడానికి కేటాయిస్తానంటుంది. ప్రతిరోజూ కనీసం ఆరు లీటర్ల మంచినీళ్లు తాగుతుందట. అందం పుట్టుకతో వచ్చినా సరే దాన్ని కాపాడుకోవల్సిన బాధ్యత మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది అంటుంది ఈ అందాల భామ.

 

మరిన్ని సినిమా కబుర్లు
same heroine for both