Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

నెగెటివ్‌ టైటిల్‌తో వరుణ్‌ హీరోయిజం

Varun  heroism with negative title

'ముకుంద' వంటి సాఫ్ట్‌ కూల్‌ టైటిల్‌తో వచ్చిన సినిమాలో నటించిన 'సుప్రీం హీరో' వరుణ్‌తేజ, రెండో చిత్రంగా 'కంచె' చేస్తున్నాడు. 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుం', 'గమ్యం' వంటి చిత్రాలు రూపొందించిన విలక్షణ దర్శకుడు క్రిష్‌, 'కంచె' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మూడో చిత్రంగా వరుణ్‌తేజ, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'లోఫర్‌' అనే చిత్రం చేయనుండగా, ఈ చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. వరుణ్‌ తేజకి మంచి మాస్‌ ఇమేజ్‌ ఇచ్చేలా ఈ సినిమా కథ ఉంటుందట. దర్శకుడు పూరి జగన్నాథ్‌ టైటిల్స్‌ విషయంలో ఎంతో కసరత్తు చేస్తాడు. 'ఇడియట్‌', 'పోకిరి' లాంటి నెగెటివ్‌ టైటిల్స్‌తో సంచలన విజయాలు సాధించిన దర్శకుడు పూరి జగన్నాథ్‌. వరుణ్‌తో చేస్తున్న సినిమాకి 'లోఫర్‌' అనే నెగెటివ్‌ టచ్‌తో కూడిన టైటిల్‌ని పెట్టి, సగం విజయం సాధించేశాడీ డైనమిక్‌ డైరెక్టర్‌. మొదటి సినిమా 'ముకుంద'తో ప్రామిసింగ్‌ హీరో అనిపించుకున్న వరుణ్‌, 'కంచె', 'లోఫర్‌' సినిమాలతో టాలీవుడ్‌లో టాప్‌ 10 హీరోల్లో చోటు దక్కించుకుంటాడని ఆశించవచ్చు. తొలి సినిమాలో డాన్సులేమీ పెద్దగా చేయని ఈ ఆరడుగుల ఆజానుబాహుడు, 'లోఫర్‌' సినిమా కోసం సూపర్‌ డాన్సులు కూడా చేస్తాడట. 

మరిన్ని సినిమా కబుర్లు
Sunil  increased Speed