Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Sunil  increased Speed

ఈ సంచికలో >> సినిమా >>

మూడో సినిమాకి ముగ్గురు హీరోయిన్లు

The third film in the three heroines

సూర్య హీరోగా వచ్చిన 'యముడు' సినిమా ఎంతో పెద్ద విజయం సాధించింది. తమిళంలో 'సింగం' సిరీస్‌లో రెండు సినిమాలు ఇప్పటికే వచ్చాయి. మొదటి సినిమా తెలుగులో 'యముడు'గా వస్తే, రెండో సినిమా 'సింగం' పేరుతో వచ్చింది. 'సింగం 3' సినిమా చర్చల దశలో ఉంది. సూర్య ఇప్పుడు నటిస్తున్న '24' అనే సినిమా పూర్తవగానే, 'సింగం 3' సినిమా మీద దృష్టిపెడతాడట. కథ కూడా రెడీ అయిపోయిందిగానీ, సూర్యదే ఆలస్యం. ఈలోగా హీరోయిన్లను కూడా దాదాపు ఓకే చేసేశారట. తొలి సినిమాలో అనుష్క మాత్రమే హీరోయిన్‌గా నటించగా. రెండో సినిమాలో అనుష్కతోపాటు, హన్సిక కూడా హీరోయిన్‌గా నటించింది. మూడో సినిమాలో, అనగా మూడో 'సింగం'లో అనుష్క, హన్సికతోపాటు శృతిహాసన్‌ నటించవచ్చని సమాచారమ్‌. శృతిహాసన్‌తో సూర్య నటించిన 'సెవెన్త్‌ సెన్స్‌' సినిమా మంచి విజయమే సాధించింది. అయితే 'సింగం' సాధించిన విజయం 'సింగం2' సాధించలేకపోయింది. అందుకే 'సింగం 3' విషయంలో పొరపాట్లకు అవకాశమివ్వకుండా సూపర్‌ హిట్‌ అయ్యే కథ, కథనాలతో రావాలని తగిన సమయం తీసుకుంటున్నాడు సూర్య. 

మరిన్ని సినిమా కబుర్లు
anushka busy with movie production