Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yuva

ఈ సంచికలో >> శీర్షికలు >>

17-07-2015 నుండి 23-07-2015 వరకు వారఫలాలు - శ్రీకాంత్

..

  

మేష రాశి :   ఈవారం మొత్తంమీద కుటుంభంలో నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. సభ్యులతో చేపట్టిన చర్చల్లో మీయొక్క స్పష్టమైన వైఖరిని తెలియజేయుట వలన మేలుజరుగుతుంది. సంతానపరామైన విషయాల్లో అనుకోని ఖర్చులను పొందుతారు. పెద్దలతో మీ సంతానానికి ఉన్న అనుభందం మరింతగా బలపడుతుంది. నూతన నిర్ణయాల విషయంలో బాగా ఆలోచించి ముందుకువెళ్ళుట వలన లబ్దిని పొందుతారు. ప్రయాణాలకు సమయం కేటాయిస్తారు. పెద్దలతో చేసిన చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి,వారితో చర్చలు చేయుటకు అవకాశం కలదు.      

 

వృషభ రాశి :ఈవారం మొత్తంమీద మిశ్రమ ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన వ్యక్తుల నుండి వచ్చు సమాచారం మీలో నూతన మార్పులకు శ్రీకారం చుడుతుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు ,కాకపోతే మీ శక్తికి తగిన పనులను ఎన్నుకోండి. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలు చేయుట వలన ఇబ్బందులు తప్పకపోవచ్చును. మీయొక్క మాటతీరు కావొచ్చు అలాగే ఆలోచనలు కావొచ్చు ఇతరుల పైన ప్రభావం చూపిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో తీసుకొనే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. మానసికంగా కొంత ఒత్తిడి తప్పకపోవచ్చును.             

మిథున రాశి :ఈవారం మొత్తంమీద కుటుంభంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. బంధువులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడుట మంచిది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో సమయపాలన పాటించుట అలాగే నలుగురికి అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. స్త్రీ / పురుష సంభందమైన విషయాల్లో వారినుండి ఆశించిన మేర సహాయం లభిస్తుంది. వాహనముల విషయంలో మాత్రం కొంత ఇబ్బందులను కలిగి ఉంటారు అలాగే తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. సోదరులతో చేయు చర్చల విషయంలో నిదానంగా లేకపోతే కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతాయి.        

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులలో సంతృప్తికరమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. -ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. చిననాటి మిత్రులను కలుస్తారు వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం కలదు. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం తొందరపాటు నిర్ణయాలు వద్దు ,అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోవడం వలన నిదానంగా లబ్దిని పొందే అవకాశం కలదు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచన.   

 

         సింహ రాశి : ఈవారం మొత్తంమీద మీరు తీసుకొనే నిర్ణయాల విషయంలో తొందరపాటు వద్దు బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. చేపట్టు పనులను జాగ్రత్తగా ప్రణాళిక బద్దంగా ముందుకు తీసుకువెళితే తప్పక లబ్దిని పొందుతారు. అనవసరమైన విషయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండుట సూచన. పెద్దలతో చేసే చర్చల సందర్భంలో వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోండి లేకపోతే కొత్త కొత్త సమస్యలు ఏర్పడుతాయి. ప్రయాణాలు చేయునపుడు విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవడం అవసరం. చిననాటి మిత్రుల నుండి విలువైన విషయాలు తెలిసే అవకాశం ఉంది. మీ మాటతీరు విషయంలో జాగ్రత్త తీసుకోండి.

 

     

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద బంధువులతో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి అవకాశం ఉంది. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. వాహనములను కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజకీయపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చిననాటిమిత్రుల నుండి నూతన సమాచరం పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. సోదరులనుండి వచ్చు సూచనలను పరిగణలోకి తీసుకోవడం మంచిది. జీవితభాగస్వామితో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు.       

 


తులా రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడిని కలిగి ఉంటారు. పెద్దలతో చేయుచర్చలు ఒక కొలిక్కి వస్తాయి. దూరప్రదేశాల నుండి వచ్చు వార్తలు మీలో సందేహాలను పెంచే అవకాశం ఉంది. బంధువులతో సమయాన్ని గడుపుతారు. తల్లితో కలిసి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. మీయొక్క మాటతీరు మూలాన నష్టపోయే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. మానసికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది.          


.వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీద స్వల్ప అనారోగ్యసమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో శ్రద్ధను వహించుట అవసరం. పనులలో శ్రమను పొందుతారు ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్ళకపోతే నూతన సమస్యలు ఏర్పడుతాయి. ఉద్యోగంలో అధికారులతో గల మంచి సంభందాలు మీకు ఉపకరిస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. బంధువులతో కలిసి సమయాన్ని గడిపే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. జీవితభాగస్వామి నుండి విలువైన సమాచారం లభిస్తుంది. మిత్రులను కలుస్తారు.   

 


ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద ఆరంభంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. కుటుంబసభ్యులతో సమయాన్ని గడుపుతారు,వారినుండి వచ్చు సూచనలను పరిగణలోకి తీసుకోండి. స్వల్పఅనారోగ్యసమస్యలు తప్పకపోవచ్చును,తగినంత విశ్రాంతిని తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో పనిఒత్తిడి తప్పక పోవచ్చును. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండుట వలన సమయం కలిసి వస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో సమయానికి ధనం చేతికి అందుతుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశీప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి.  

 

  

మకర రాశి :  ఈవారం మొత్తంమీద నూతన పనులను ఆరంభించుటలో ఉత్సుకతను చూపిస్తారు. నూతన ప్రయత్నాలు మొదలుపెట్టే ముందు పెద్దల అనుభవాలు,సూచనలు పరిగణలోకి తీసుకోవడం మంచిది. నలుగురికి ఉపయోగపడే ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి తీసుకొనే నిర్ణయాలు ఊహించని మార్పులకు అవకాశం ఇస్తాయి. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు మీచేయుదాటిపోయే అవకాశం ఉంది. తలపెట్టిన పనులను మధ్యలో వదిలేయకండి. చర్చల్లో పాల్గొంటారు మీయొక్క ఆలోచనలు అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి సర్దుబాటు అవసరం.   

 


కుంభ రాశి : ఈవారం మొత్తంమీద నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయుట ద్వార మంచి గుర్తింపును పొందుతారు. మీయొక్క ఆలోచనల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన మరింత లబ్దిని పొందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో అధికారులతో సత్సంభందాలు ఏర్పడుతాయి. సంతానం విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూరప్రదేశప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట మంచిది. మిత్రులనుండి వచ్చు సూచనలు మీలో ఒత్తిడిని పెంచే అవకాశం కలదు,కావున మానసికంగా దృడంగా ఉండుట సూచన.            

 


మీన రాశి : ఈవారం మొత్తంమీద సమాజంలో గుర్తింపును కోరుకొంటారు. చేపట్టిన పనులను కాస్త ఇబ్బందికి లొనయినను సమయానికి పూర్తిచేసే అవకాశం ఉంది. నూతన పనులను ఆరంభించుట యందు ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఊహించని ఖర్చులను పొందుతారు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం విఫలం అవుతుంది. సమయానికి భోజనం చేయుట అవసరం. భోజనపరమైన ఇబ్బందులు అలాగే అజీర్తి సమస్యలు ఏర్పడే ఆస్కారం కలదు జాగ్రత్త. దూరప్రదేశంలో ఉన్న అధికారులతో విలువైన విషయాల గురుంచి చర్చలు చేస్తారు. కుటుంబంలో సభ్యుల ఆలోచనలను మీరు వ్యతిరేకించే ఆస్కారం కలదు. ఆలోచనల్లో కొంత అసంతృప్తి పెరుగుటకు అవకాశం ఉంది. కొన్ని కొన్ని విషయాల్లో సర్దుబాటు తప్పనిసరి.    

టి. శ్రీకాంత్ 

వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
padyam - bhavam