Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
same way srimantudu movie

ఈ సంచికలో >> సినిమా >>

మోహన్‌బాబుతో 'అల్లరి' చేస్తాడట

naresh with mohanbabu

సీరియస్‌ పాత్రలకే కాకుండా కామెడీకి కూడా పెట్టింది పేరు మోహన్‌బాబు. కామెడీ విలన్‌గా ఎన్నో సినిమాల్లో మోహన్‌బాబు విలనిజంతోపాటు కామెడీని కూడా పండించారు. హీరోగా చేసిన సినిమాల్లోనూ మోహన్‌బాబు కామెడీకి అగ్ర తాంబూలం ఇచ్చారు. అల్లరి నరేష్‌ పేరు చెబితేనే చక్కిలిగిలి పెట్టినట్లుగా నవ్వుకోవాలి తెలుగు ప్రేక్షకులు. తొలి సినిమా 'అల్లరి'నే ఇంటి పేరుగా మర్చేసుకున్న అల్లరి నరేష్‌ తెలుగులో కామెడీ స్టార్‌. కామెడీ స్టార్‌, కామెడీ విలనిజంతో స్టార్‌డమ్‌ సంపాదించుకున్న కలెక్షన్‌ కింగ్‌ కలిసి నటిస్తే ఆ సినిమా సెన్సేషన్‌ కాకుండా ఉంటుందా? ఖచ్చితంగా సెన్సేషన్‌ అవుతుందని అంటున్నాడు మంచు విష్ణు. 24 ఫ్రేమ్స్‌ పతాకంపై మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా పేరు 'మామ మంచు అల్లుడు కంచు'. టైటిల్‌లోనే కావాల్సినంత కామెడీ ఉంది. రెండు పాటల రికార్డింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. వారే బప్పీ లహరి, అచ్చు, రఘు కుంచె. అల్లరి, మంచులను కలుపుతున్న దర్శకుడు శ్రీనివాసరెడ్డి.

మరిన్ని సినిమా కబుర్లు
bahubali proved telugu power