Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naresh with mohanbabu

ఈ సంచికలో >> సినిమా >>

తెలుగోడి సత్తా చాటిన 'బాహుబలి'

bahubali proved telugu power

రాజమౌళి మార్క్‌ ఎమోషన్స్‌ లేవనే కొన్ని కామెంట్స్‌ వచ్చినా అవి కేవలం తెలుగు సినీ పరిశ్రమకే పరిమితమైపోయాయి. 'బాహుబలి' సినిమా మాత్రం జాతీయ స్థాయిలో తెలుగోడి సత్తా చాటి చెప్పింది. పబ్లిసిటీ ప్లానింగ్‌, సినిమాలో వైవిధ్యం అన్నీ కుదిరాయి. 'బాహుబలి' గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేయగలిగాడు దర్శకుడు రాజమౌళి. వంద కోట్లు, రెండొందల కోట్లు, ఆపైన అనే బిజినెస్‌ లెక్కల్ని పక్కన పెట్టి చూస్తే, ఎన్ని కోట్లు సంపాదించినా రాని గుర్తింపు తెలుగు సినిమాకి జాతీయ స్థాయిలో దక్కడం ప్రతి తెలుగువాడూ గర్వించదగ్గ విషయం. మిక్స్‌డ్‌ రివ్యూస్‌ తెలుగులోనే వచ్చాయి.

హిందీ, తమిళంలో సినిమాకి అనూహ్యమైన టాక్‌, రివ్యూస్‌ లభించాయి. ఎందుకంటే ఆయా భాషల్లో 'బాహుబలి' సినిమాపై ఉన్న అంచనాలు వేరు. తెలుగు సినీ ప్రేక్షకులకు రాజమౌళి సినిమాలు అలవాటైన తీరు వేరు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గ ఎమోషనల్‌ సీన్స్‌, తన మార్క్‌ టేకింగ్‌ని 'బాహుబలి' రెండో పార్ట్‌లో రాజమౌళి చూపిస్తాడట. ఇకనేం, మరో అద్భుతానికి తెలుగు ప్రేక్షకులు రెడీ అయిపోవచ్చు.

మరిన్ని సినిమా కబుర్లు
No more ramakrishna