Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
No more ramakrishna

ఈ సంచికలో >> సినిమా >>

పూజా భట్‌ బోల్డ్‌ స్టేట్‌మెంట్‌

poojaabhatt bold statement

బాలీవుడ్‌లో పూజా భట్‌ పేరు చెప్పగానే ఎవరికైనా ఆ టైపు సినిమాలే గుర్తుకొస్తాయ్‌. బూతు సినిమాలు అనదగ్గ స్థాయిలో ఎన్నో ఎరోటిక్‌ సినిమాల్లో పూజాభట్‌ నటించి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు 43 ఏళ్ళ వయసులో కూడా పూజాభట్‌ బోల్డ్‌గా కనిపించడానికి సిద్ధంగానే ఉందట. ప్రేక్షకులు ఏం చూడటానికైనా సిద్ధంగానే ఉంటారనీ, సినిమాలో స్టఫ్‌ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చెబుతున్న పూజాభట్‌, సెన్సార్‌ బోర్డ్‌ తీరుని అన్ని సందర్భాల్లోనూ తప్పు పట్టడం సరికాదని అభిప్రాయపడింది. 'క్యాబరెట్‌' అనే సినిమాని రిచా చడ్డాతో చాలా బోల్డ్‌గా నిర్మిస్తోంది పూజాభట్‌. ఇరవయ్యేళ్ళ క్రితం బాలీవుడ్‌లో సినిమాలు మరీ బోల్డ్‌గా ఉండేవి కావన్న ఈ సెక్సిణి, మారుతున్న ట్రెండ్‌కి అనుగుణంగా బోల్డ్‌ సన్నివేశాల్ని కూడా సెన్సార్‌ బోర్డ్‌ అనుమతిస్తున్నట్లు చెప్పింది. కొత్త కొత్త ఆలోచనలతో, బోల్డ్‌ సినిమాలు చేసినా, సన్నివేశానికి తగ్గట్టుగా అవి ఉంటే సెన్సార్‌ని మెప్పించడం కష్టం కాదని బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది పూజా భట్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam