Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vignaanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

పద్యం - భావం - సుప్రీత

 వేమన పద్యం

వేష భాష లెరిగి కాషయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులైన తలపులు బోడులా
విశ్వదాభి రామ వినుర వేమ.

తాత్పర్యం

వేషభాషలు నేర్చుకుని , కాషాయవస్త్రములు ధరించినంత మాత్రాన మోక్షము రాదు. గుండు గీయించుకున్న మాత్రాన దురాలోచనలు రాకుండావుంటాయా ?

విశ్లేషణ

కొంత మంది వేషము భాషా మర్చుకొని ఋషుల వలే కాషాయ వస్త్రాలు దరిస్తారు , అవి ధరించినమాత్రాన మోక్షం రాదు. ఎప్పుడైన మంచి మనస్సుతో నిత్యం దైవ ఆరాధన చేస్తూ , పది మందికి సహాయం చేస్తు ఉంటే మోక్షం వస్తుంది.  మనకి చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి అని మనం గుండు గీయించుకుంటే చెడు ఆలొచనలు ఆగిపోతాయా? అన్నది ఈ పద్యం లో నీతి.

దాశరధీ పద్యం

దురమున దాకటకందునిమి ధూర్జటివిల్ దునుమాడి సీతన్
బరిణయమంది తండ్రి పనుపన్ ఘనకానన భూమికేగి దు
స్తర పటు చండ కాండ కులిశాహతి రావణ కుంభకర్ణ భూ
ధరముగూల్చి తీవె కద  దాశరధీ కరుణాపయోనిధీ.

తాత్పర్యం

ఓ దశరధ రామా ! మానవుడే మహనీయుడనే విధంగా ధర్మ మాచరించి చూపిన నీవు మమ్ము ధర్మమార్గము తప్పకుండునట్లు దీవింపుము. తాటకను సంహరించి , శివధనుర్భగముకావించి, సీతను వివాహమాడి, తండ్రి ఆజ్ఞ తో అడవులకేగి , రావణ, కుంభకర్ణాది దుష్టదానవుల సంహరించిన రామా! నీ చరిత్ర మాకాదర్శమగు నట్లుగా దీవింపుము.

విశ్లేషణ

రాముడు ధర్మాత్ముడు , మనుషులకి ఆదర్శప్రాయుడు. ధర్మం అనేది రాముడి దగ్గిరనుంచే అందరు నేర్చుకున్నారు. మనిషి చాలా ప్రలోభాలకి లొంగుతాడు , మనిషి మనస్సు కోతి వంటిది ఎప్పుడు తమ స్వార్ధం కోసమె ఆలోచలని చేస్తుంది, స్వార్ధం ఎంత పని అయినా చేయిస్తుంది. ఆఖరికి ధర్మం కూడా తప్పటానికి వెనకాడడు మనిషి స్వార్ధం కోసం. అలాంటిది రామదాసు రాముడిని అర్ధిస్తున్నాడు ఏ విధం గా అయితే రాముడు ధర్మ మర్గములని ఆచరించి కార్యాలు నెరవేర్చాడొ అదే విధం గా మమల్ని కూడ ధర్మ మర్గము తప్పకుండా కాపాడు అని చెప్పటమే ఈ పద్యం లో నీతి. 

సుమతీ శతకం 

రూపించి పలికి బొంకకు
ప్రాపగు చుట్టంబు నెగ్గు పలుకకు మదిలోఁ
గోపించురాజుఁ గొల్వకు
పాపుదేశంబు సొరకు పదిలము సుమతీ!

తాత్పర్యం

సాక్షులతో నిర్ధారణ చేసి అబద్ధాన్ని నిజమని స్థిరపరచడం, ఆప్తబంధువులను నిందించడం, కోపిని సేవించడం,     పాపభూమికి వెళ్లడం తగని పనులు. కావున ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.

విశ్లేషణ

మనుషులు తమని రక్షించుకోవటానికి ఎంత కైనా తెగిస్తారు, ఒక అబద్దాన్ని కూడ సాక్షాల తో నిజమని నిరూపిస్తారు. తమ దగ్గిర వారిని తిట్టటానికి వెనకాడరు, అల తిట్టి అయినవాళ్ళందరిని దూరం చేసుకుంటారు. ఎదుటివ్యక్తి ముక్కోపి అని తెలిసిన సరే వారి వల్ల ఉపయోగం ఉంటే సేవించటానికి వెనకాడరు. పాప భూమికి వెళ్లటం తప్పని తెలిసినా వెళ్తారు .ఇవన్ని తగని పనులు అని తెలిసినా చేస్తారు. వీటిల్లో జాగ్రతగా ఉండాలి అని చెప్పటమే ఈ పద్యం లో నీతి.

మరిన్ని శీర్షికలు
navvunaluguyugalu