Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
.bahubali menia...

ఈ సంచికలో >> సినిమా >>

'సర్దార్‌'గా పవన్‌కళ్యాణ్‌

pavan ' as Sardar

అందరూ అనుకుంటున్నట్టుగా 'గబ్బర్‌సింగ్‌' సీక్వెల్‌కి 'గబ్బర్‌ సింగ్‌ 2' అని కాకుండా 'సర్దార్‌' అనే పేరు పెట్టదలచారని సమాచారమ్‌. పవన్‌కళ్యాణ్‌ స్వయంగా టైటిల్‌ మార్పు చేపట్టాడని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంతవరకూ రాలేదు. మొదట్లో 'బెంగాల్‌ టైగర్‌' అనే టైటిల్‌ ప్రచారంలోకి రాగా, ఆ టైటిల్‌తో ఇప్పుడు రవితేజ హీరోగా సినిమా రానుంది. సంపత్‌ నంది తన స్క్రిప్ట్‌కి మొదట 'బెంగాల్‌ టైగర్‌' అని వర్కింగ్‌ టైటిల్‌ పెట్టుకున్నాడట. దర్శకుడు మారాడు, పేర్లు కూడా మారాయి. కథలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు జరిగి, చివరకు 'సర్దార్‌' వద్ద ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసి ఈ సంవత్సరంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడట పవన్‌కళ్యాణ్‌. ఒకవేళ కుదరని పక్షంలో, 2016 సంక్రాంతికి 'గబ్బర్‌సింగ్‌' సీక్వెల్‌ అయిన 'సర్దార్‌' రావొచ్చునట. 'గబ్బర్‌సింగ్‌'ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్షన్‌, ఎమోషన్స్‌ 'సర్దార్‌'లో ఉంటాయని అనుకుంటున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
srimantudu ready for  century