Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Movie Review : James Bond

ఈ సంచికలో >> సినిమా >>

'బాహుబలి' మేనియా తగ్గలేదు

.bahubali menia...

నిస్సందేహంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా 'బాహుబలి'. విడుదలైన అన్ని భాషల్లోనూ అద్భుత విజయాన్ని సాధించడమే కాదు, ఇలాంటి సినిమా ఇండియన్‌ సినిమా స్క్రీన్‌పైన రావడమే అద్భుతమన్న ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇందులో దర్శక ధీరుడు రాజమౌళికే ఎక్కువ క్రెడిట్‌ దక్కుతుంది. అయితే ఈ సాహసానికి ఆయన పూనుకోవడంలో సహకరించిన నటీనటులు, ఇతర టెక్నీషియన్ల శ్రమను తక్కువ చేయలేం. ఈ గొప్ప 'బాహుబలి' కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిదీ. హీరో పాత్రలో ప్రభాస్‌, నెగెటివ్‌ రోల్‌లో రాణా, సపోర్టింగ్‌ పాత్రల్లో రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌, అందాల తారగా కనిపించిన తమన్నా, ఆమెతోపాటుగా అనుష్క ఎవర్ని గురించి తక్కువ చెప్పగలం? ప్రతి ఒక్కరూ సహకరించి 'బాహుబలి'ని ఎవరెస్ట్‌ శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్ళారు. వారి శ్రమ వృధా కాలేదు. ఇంకా ఎత్తుకు తీసుకెళ్ళారు ప్రేక్షకులు. బాలీవుడ్‌లో డబ్బింగ్‌ సినిమాలు సాధించిన విజయాల్లో 'బాహుబలి'దే అతి పెద్దది. తెలుగు సినీ చరిత్రలో గత రికార్డుల్ని 'బాహుబలి' తిరగరాసింది. రోజులు గడుస్తున్నా 'బాహుబలి' మేనియా తగ్గలేదు. ఇది తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. 

మరిన్ని సినిమా కబుర్లు
pavan ' as Sardar