Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pavan ' as Sardar

ఈ సంచికలో >> సినిమా >>

'శ్రీమంతుడు' సెంచరీ కొట్టడానికి రెడీ

srimantudu ready for  century

తెలుగు సినీ పరిశ్రమలో వంద కోట్ల వసూళ్ళను దాటిన తొలి చిత్రంగా 'బాహుబలి' రికార్డు సృష్టిస్తే, ఆ వెంటనే ఇంకో సినిమా కూడా వంద కోట్ల వసూళ్ళను సాధించడానికి రెడీ అవుతున్నది. అదే 'శ్రీమంతుడు'. సూపర్‌ స్టార్‌ మహేష్‌, 'మిర్చి' ఫేం కొరటాల శివ కాంబినేషన్‌లో రానున్న 'శ్రీమంతుడు'పై భారీ అంచనాలున్నాయి. కేవలం అంచనాలే కాదు, ఆ అంచనాల్ని అందుకునే కంటెంట్‌ కూడా 'శ్రీమంతుడు'లో ఉందట. ఆడియో విడుదలై అభిమానుల్ని విశేషంగా అలరిస్తోంది. ఆడియన్స్‌ ముందుకు రావడానికి ముస్తాబవుతున్న 'శ్రీమంతుడు' ఈజీగా వంద కోట్లు కొల్లగొడ్తుందని అంచనా వేస్తున్నారు టాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు. 60 కోట్ల పైన సినిమాకి బిజినెస్‌ జరిగినట్లు సమాచారమ్‌ అందుతుంది. ఓవర్సీస్‌పై మహేష్‌బాబుకి మంచి పట్టుంది. ఆ పట్టుతో హయ్యస్ట్‌ వసూళ్ళు అక్కడే సూపర్‌ స్టార్‌ కొల్లగొట్టేస్తాడంటున్నారు. నైజాం సహా అన్ని ఏరియాల్లోనే ప్రేక్షకులు థియేటర్లకు వరదలా వచ్చేంత సబ్జెక్ట్‌ సినిమాలా ఉందట. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా స్క్రిప్ట్‌ తయారుచేయడంతో సగం సక్సెస్‌ అక్కడే సాధించేశామని 'శ్రీమంతుడు' టీమ్‌ ధీమాతో ఉంది. ఆ ధీమా నిజమై, ఇంకో సినిమా వంద కోట్లు కొల్లగొడితే తెలుగు సినీ రంగానికి అంతకన్నా హ్యాపీ న్యూస్‌ ఇంకేముంటుంది? 

మరిన్ని సినిమా కబుర్లు
in side  tredetional, out side glamour