Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
srimantudu ready for  century

ఈ సంచికలో >> సినిమా >>

లోపల ట్రెడిషనల్‌, పైకి హాట్‌ హాట్‌ గ్లామర్‌

in side  tredetional, out side glamour

'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన రాశి ఖన్నా చాలా ట్రెడిషనల్‌ అట. అయితే ఆ ట్రెడిషనల్‌ ఆలోచనలు మనసులోనే ఉంటాయట. సినీ రంగంలోకి వచ్చాక గ్లామర్‌తోనే సహవాసం చెయ్యాల్సి ఉంటుంది కాబట్టి, తెరపై అవసరమైనంత గ్లామరస్‌గా కనిపిస్తానని చెప్పింది రాశి ఖన్నా. మోడ్రన్‌ ట్రెండ్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతానంటూ, ట్రెండీగా ఉండటానికి ఇష్టపడతానని వివరించింది. తొలి సినిమా 'ఊహలు గుసగుసలాడే'లో మోడ్రన్‌ డ్రస్సులేసినా, హాట్‌ అప్పీల్‌ జోలికి వెళ్ళని ఈ బొద్దు ముద్దుగుమ్మ, 'జిల్‌' సినిమాకొచ్చేసరికి హీటెక్కించే కురచ దుస్తులతో యువ ప్రేక్షకుల గుండెల్ని కొల్లగొట్టేసింది. శారీ కట్టుకోవడం చాలా ఇష్టమట రాశీ ఖన్నాకి. ఫ్యాషన్‌ ట్రెండ్స్‌ని ఫాలో అవుతూ ట్రెడిషనల్‌ దుస్తుల్లో ఒదిగిపోవడాన్ని ఎంతో ఎంజాయ్‌ చేస్తాననే రాశి ఖన్నాకి సింగింగ్‌ టాలెంట్‌ అదనం. 'జోరు' సినిమాలో టైటిల్‌ సాంగ్‌ పాడి ఆడియన్స్‌ని ఎంత జోరెక్కిందో చూసేశాం కదా. కెరీర్‌లో తీరిక అనేదే లేకుండా చకచకా సినిమాలు చేసుకుంటూ పోతున్న రాశి ఖన్నాకి ఆల్‌ ది బెస్ట్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
rudramadevi colourfull