Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
in side  tredetional, out side glamour

ఈ సంచికలో >> సినిమా >>

కలర్‌ ఫుల్‌ 'రుద్రమదేవి'

rudramadevi colourfull

 
తెలుగు సినీ ప్రేక్షకులు ఈ సంవత్సరం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన సినిమాల్లో మొదటిది 'బాహుబలి' రిలీజై మంచి విజయం సాధించగా, రెండో సినిమా 'రుద్రమదేవి' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. 'బాహుబలి' సాధించిన విజయంతో, ఆ సినిమా టెక్నిక్‌నే 'రుద్రమదేవి' కూడా ఫాలో అవుతోంది. సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ లుక్స్‌ని దర్శక నిర్మాత గుణశేఖర్‌ విడుదల చేస్తున్నాడు. వీటిల్లో ప్రకాష్‌రాజ్‌, కృష్ణంరాజు, కేథరీన్‌ ట్రెసా, నిత్యామీనన్‌ తదితర నటీనటులు పోషించిన పాత్రలు, ఆ గెటప్స్‌ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. 'రుద్రమదేవి' టైటిల్‌లో రోల్‌లో అనుష్క గెటప్‌ ఇప్పటికే సినిమాపై అంచనాల్ని పెంచేయగా, అల్లు అర్జున్‌ 'గోనగన్నారెడ్డి' పాత్రలో సినిమాకి కావాల్సినంత హైప్‌ తెచ్చాడు. కలర్‌ఫుల్‌గా 'రుద్రమదేవి' ఉంటుందని ఈ పాత్రల పరిచయంతోనే ప్రేక్షకులకు అర్థమైపోయింది. 'బాహుబలి' గురించి దేశమంతా చెప్పుకుంటున్నట్లే 'రుద్రమదేవి' గురించి కూడా అందరూ మాట్లాడుకుంటారని సినిమా యూనిట్‌ భావిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam