Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష : జేమ్స్‌బాండ్‌ (నేను కాదు నా పెళ్ళాం)

Movie Review : James Bond

చిత్రం: జేమ్స్‌బాండ్‌ (నేను కాదు నా పెళ్ళాం)
తారాగణం: అల్లరి నరేష్‌, సాక్షి చౌదరి, ఆశిష్‌ విద్యార్థి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, రఘుబాబు, అలీ, జయప్రకాష్‌రెడ్డి, పృధ్వీ, ప్రవీణ్‌, చంద్రమోహన్‌, ప్రభ, హేమ తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల
నిర్మాణం: ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లిమిటెడ్‌
దర్శకత్వం: సాయికిషోర్‌ మచ్చ
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
విడుదల తేదీ: 10 జులై 2015

క్లుప్తంగా చెప్పాలంటే:
మాఫియా డాన్‌ పూజ (సాక్షి చౌదరి) కొన్ని కారణాలతో అమాయకుడైన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నాని (నరేష్‌)ని పెళ్ళాడుతుంది. పెళ్ళయ్యాకగానీ తాను పెళ్ళి చేసుకున్నది సాదా సీదా అమ్మాయిని కాదని తెలుసుకుంటాడు అల్లరి నరేష్‌. లేడీ మాఫియా డాన్‌ చేతిలో అమాయకుడైన భర్త పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. అయితే పూజ వెనుక పెద్ద కథే ఉంటుంది. ఆ కథేంటి? ఆ కథ తెలుసుకున్న నాని, పూజని అర్థం చేసుకున్నాడా? లేడీ మాఫియాడాన్‌, తన భర్తను అర్థం చేసుకుందా? అన్నది తెరపైనే చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే:
అల్లరి నరేష్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ పరంగా కొత్తగా చేసిందేమీ లేదు. అమాయపు భర్త పాత్రలు ఇదివరకే చేసేశాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించడానికి ప్రయత్నించాడు అల్లరి నరేష్‌. సాక్షి చౌదరి గ్లామరస్‌గా కనిపించింది. మాఫియా డాన్‌గా బాగానే చేసింది. కానీ ఎక్స్‌ప్రెషన్స్‌ పలకలేదు. ట్రెడిషనల్‌ ఔట్‌ ఫిట్స్‌కి సరిగ్గా సూటవలేదు. చాలామంది కమెడియన్లు ఉన్నా ఎవరికీ పేరు తెచ్చే పాత్రలు దక్కలేదు. ఉన్నంతలో పోసాని, పృధ్వి తమ ఉనికిని చాటుకున్నారంతే.

కథ పరంగా చూస్తే సినిమాకి కావాల్సినంత కామెడీని ఇరికించే అవకాశం ఉంది. కానీ దర్శకుడు అలా చేయడంలో విఫలమయ్యాడు. స్క్రీన్‌ప్లే వైఫల్యం కూడా కనపిస్తుంది. సంగీతం జస్ట్‌ ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కూడా అంతే. సినిమాటోగ్రఫీ గురించి గొప్పగా చెప్పుకోడానికేమీ లేదు. డైలాగ్స్‌లో అవసరమైన పంచ్‌లు తక్కువ, అనవసరపు పంచ్‌లు ఎక్కువయ్యాయి. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ బాగానే ఉన్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్స్‌ పనితీరు ఫర్వాలేదు.

జేమ్స్‌బాండ్‌ సినిమాలంటే పిచ్చ క్రేజ్‌ సినిమా ఆడియన్స్‌కి. ఆ టైటిల్‌ పెట్టుకుని కామెడీ సినిమా తీసినప్పుడు కావాల్సినంత కామెడీని పెట్టి ఉంటే కామెడీ లవర్స్‌ని బాగా ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగేది. ఫస్టాఫ్‌ ఓకే అనిపించినా, సెకెండాఫ్‌ చాలా బోరింగ్‌ అనిపిస్తుంది. కమెడియన్స్‌ని సరిగ్గా వాడుకోకపోవడం కామెడీ సినిమాకి పెద్ద వీక్‌. అల్లరి నరేష్‌ లాంటి కమెడియన్‌తో ఇలాంటి సినిమాల్ని అద్భుతంగా తెరకెక్కించే ఛాన్స్‌ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు దర్శకుడు. అల్లరి నరేష్‌ పెర్ఫామెన్స్‌, సాక్షి గ్లామర్‌ ఇవన్నీ సినిమాని ఓకే అనే స్టేజ్‌కి తీసుకెళతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే:
ఈ జేమ్స్‌బాండ్‌ అల్లరి చేయలేకపోయాడు

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
.bahubali menia...