Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 31st july  to 6th august

ఈ సంచికలో >> శీర్షికలు >>

కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ..

 

తిక్క : ఎంవీ అప్పారావు గారికి నమస్కరించకుండా ఉండలేమా సర్?
తొక్క : మస్కాకొట్టకుండా వుంటే చాలు...

తిక్క : ఇప్పటి కార్టూనిస్టులకంటే ఎంతో ముందే పుట్టి, ఎన్నో కార్టూన్లు వేసారెందుకు?
తొక్క : ఇప్పటి కార్టూనిష్టులకు ఫోటీ రాకూడదని !

తిక్క : మీ కార్టూన్లకు కారణాలు ఎవరు అన్వేషించారు?
తొక్క : నా కార్టూన్లు అర్ధంకాని కార్టూన్ ఇష్టులు !!

తిక్క : కార్టూన్లు వెయ్యడానికి ఇంకూ, బ్రష్హూ, నిబ్ లాంటివి వాడతారా, లేక, గర్వం, అహంకారం అధికారం ఉపయోగిస్తారా?
తొక్క : అవన్నీ కాదు  బాబూ!!  కుడిచేతితోనే వేస్తాను!!

తిక్క : రామ రావణ యుద్ధ సమయంలో మీ కార్టూన్లు ఎక్కడ దాచారు?
తొక్క : ఎక్కడ దాచానంటే "అశొకవనం"లోనే! మరి కార్టూన్లంటే శోకం లేకుండా నవ్వించేవి కదా!

తిక్క : ఇంకా ఎప్పుడు కార్టూన్లేస్తారు?
తొక్క : ఏమీ తోచనప్పుడు!!

తిక్క : కల్లోలిత కశ్మీరంలో మీ కార్టూన్లకు కష్టకాలమెప్పుడైనా వచ్చిందా?
తొక్క : బాంబుల్లా కార్టూన్లు కొన్నిసార్లు పేలుతాయి కదా!!

తిక్క : అప్పుడే మీకెవరూ మీ కార్టూన్ల గురించి చెప్పలేదా?
తొక్క : నవ్వులూరుకు షికారులు తిప్పే కారుటూనులు !!

తిక్క : మీ కార్టూన్ల పేరేమిటి?
తొక్క : "నవ్వులపాలు"చేసేవి

తిక్క : ఒడిదుడుకులనెదుర్కొంటున్న షేర్ మార్కెట్ ప్రభావం మీ కార్టూన్లపై చాలా ప్రభావం చూపినట్టుంది?
తొక్క : షేర్లు పడేటట్లు నా కార్టూన్లు పడే ప్రమాదం ఇప్పట్లో లేదు. కారణం నేను పత్రికకులకు పంపితేకదా పడటానికి !!

తిక్క : సురేఖార్ట్యూనులెవరివి?
తొక్క : పాడు కార్ "ట్యూన్లు" కట్టేవారివి !!

తిక్క : మీ కార్టూన్లకు మెచ్చి మీరెవరికీ ఎలాంటి బిరుదులూ ఇవ్వలేదా?
తొక్క : నేనిచ్చే బిరుదలను చూసి బెదిరిపోతున్నారు మరి !!

తిక్క : మీ కార్టూన్లు చూసి అసూయ పడేవారికి మీరెలాంటి సాయం చేస్తారు?
తొక్క : అసూయ"పడే"వారిని చెయ్యిచ్చి లేపుతా!!

తిక్క : మళ్ళీ పుష్కరాల నాటికి కొత్త కార్టూన్లు కొంటారా?
తొక్క : ఆ!మీ దగ్గర నుంచి తప్పక తీసు"కొంటా"!

తిక్క : బ్యాంకులో డబ్బులైపోతే మీ కార్టూన్లు అప్పుగా ఇచ్చేవారా?
తొక్క : నా కార్టూన్లు అప్పుతీసుకున్న మీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేమంటారు !!

తిక్క : కార్టూన్లలో ఉప్పెక్కువైతే ఆపేస్తారా?
తొక్క : లేదు, మరింత వెట"కారం"కలుపుతా !!

తిక్క : ఎంవీ అప్పారావుగారి కార్టూన్లంటే అందరికీ ఇష్టమే. అయితే మీకేంటి ప్రాబ్లం?
తొక్క : ఎందరికి ఇష్టమో లెక్కేసుకోవడమే ప్రొబ్లం !!

తిక్క : కోరుకున్న వెంటనే మీ కార్టూన్లు ప్రత్యక్షం కావాలంటే తపస్సు చేయాలా, బ్యాంకులను కొల్లగొట్టాలా?
తొక్క : కోరుకున్న వెంఠనే  ప్రత్యక్షమవ్వాలంటే  పాపం కార్టూన్లు నా దగ్గరకు రావాలి కదా! పెట్రోల్లు
కోసం బ్యాంకులుకాదు బంకులు కొల్లగొట్టాలి!!


తిక్క : కార్టూన్లు సూటిగా తగలాలంటే సూదితో వేయాలా, రోకలి బండతో వేయాలా?
తొక్క : చెక్కతో వెయ్యాలి. అప్పుడే జనాల పొట్టలు నవ్వి నవ్వి చెక్కలయ్యేది !!

తిక్క : ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కలంటే మీ కార్టూన్లు తప్ప గత్యంతరం లేదా?
తొక్క : ద్రవ్యానికి బలంలేక చిక్కిపోయింది. మంచి టానిక్ కార్టూన్లివ్వాలి మరి!

తిక్క : తుంటర్వ్యూ గురించి ఏమైనా ఆలోచించారా?
తొక్క : ఇంతకీ ఈ తుంటర్వ్యూ ఇండోర్ లోనా అవుట్ డోర్లానా? ఇండోర్ లోనే బావుంటుంది!
ఏమంటే నేనింతవరకూ "ఇండోర్" చూడలేదు మరి!


తిక్క : కేవలం ఆరు గంటల వ్యవధిలో మూడు కార్టూన్లు గీస్తే గిన్నిస్ బుక్ లోకి ఎక్కేయవచ్చా?
తొక్క : గిన్నీస్ బుక్ లో కార్టూన్లేస్తే ఆ గిన్నీస్ బుక్కులన్నీ ఇక గన్నీస్ సంచుల్లో మూటగట్టాలి!!

తిక్క : మీరు లోన్స్ ఇచ్చినట్టే కార్టూన్లు కూడా కస్టమర్లకు ఇచ్చేవారా?
తొక్క : కార్టూన్లను కష్టమర్లకిచ్చి వాళ్ళని కష్టాలతో "మర్" చేయడం బాగుండదుకదా!!

తిక్క : మీ తుంటర్వ్యూ ఇక్కడితో మొదలు పెడమా సార్..?
తొక్క : తుంటర్వ్యూ కదా పైనుంచైనా క్రిందనుంచైనా ఒకటే కదా!!ఇక ఆఖరునుంచైనా పర్వాలేదు!
ఇప్పుడు అన్నీ మేడిన్ చైనా ఏ కదా!!     -------- సురేఖ

మరిన్ని శీర్షికలు
sage , Professor ' Abdul Kalam ' tribute !