Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మహేష్‌ ఎంతటి శ్రీమంతుడో

mahesh as srimantudu

వచ్చేస్తున్నాడు మహేష్‌ 'శ్రీమంతుడు'గా. మరో 'వంద కోట్ల తెలుగు సినిమా'గా మహేష్‌ 'శ్రీమంతుడు' రికార్డులకెక్కుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'మిర్చి' డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్‌బాబు సరసన తొలిసారి హీరోయిన్‌గా నటిస్తోంది శృతిహాసన్‌. క్లీన్‌ అండ్‌ కూల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'శ్రీమంతుడు' చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించాడట. అలాగని మాస్‌ ఎలిమెంట్స్‌ ఉండవని కాదు. అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చేలా 'శ్రీమంతుడు' చిత్రాన్ని దర్శకుడు రూపొందించాడని ఇండస్ట్రీలో సినిమాపై మంచి టాక్‌ నడుస్తోంది. మహేష్‌బాబు కూడా కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ 'శ్రీమంతుడు'లో ఇచ్చాడని అంటున్నారు. సినిమాకి బిజినెస్‌ కూడా చాలా బాగా జరిగిపోయిందని సమాచారమ్‌. ఓవర్సీస్‌లో మహేష్‌ మార్కెట్‌ని 'శ్రీమంతుడు' డబుల్‌ చేయనుందట. వంద కోట్లు పక్కా అని సినీ ఇండస్ట్రీ 'శ్రీమంతుడు' గురించి చర్చించుకుంటోంది. అయితే మహేష్‌ ఎంతటి 'శ్రీమంతుడు' అవుతాడో సినిమా రిలీజ్‌ తర్వాత తెలుస్తుంది. వెయిట్‌ అండ్‌ సీ.

మరిన్ని సినిమా కబుర్లు
' crack ' reveals mega hero