Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mahesh as srimantudu

ఈ సంచికలో >> సినిమా >>

'తిక్క' చూపించనున్న మెగా హీరో

' crack ' reveals mega hero

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ నటిస్తున్న కొత్త సినిమా పేరు 'తిక్క'. కళ్యాణ్‌రామ్‌తో 'ఓం' సినిమా రూపొందించిన సునీల్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ పతాకంపై డాక్టర్‌ సి.రోహిణ్‌ రెడ్డి ఈ 'తిక్క' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'ఓం' సినిమాతో వచ్చిన అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవడంలో తడబడ్డాడు సునీల్‌రెడ్డి. అయితే డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో సినిమా చేయాలన్న అతని ఆలోచనకు అప్పట్లో పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ దఫా ఎలాంటి గందరగోళానికీ తావు లేకుండా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని సునీల్‌రెడ్డి తెరకెక్కిస్తున్నాడట. సాయిధరమ్‌ తేజ కూడా సినిమా సినిమాకీ పరిణతిని ప్రదర్శిస్తున్నాడు. మెచ్యూర్డ్‌ పెర్ఫామెన్స్‌తో సినిమాని పీక్స్‌కి తీసుకెళ్ళనున్నాడట సాయి. మెగాస్టార్‌ని తలపించే డాన్సులతో, పవర్‌స్టార్‌ని మరిపించే ఎనర్జీతో సాయిధరమ్‌తేజ 'తిక్క' చూపించడానికి రెడీ అవుతున్నాడు. సాయి నటించిన 'సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌' సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్ళవలసి ఉంది. ఆల్‌ ది బెస్ట్‌ టు సాయిధరమ్‌తేజ.

మరిన్ని సినిమా కబుర్లు
compare with heros