Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
' crack ' reveals mega hero

ఈ సంచికలో >> సినిమా >>

హీరోలతో పోల్చేసుకుంటున్న హీరోయిన్‌

compare with heros

హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు వస్తున్నా హీరోలతో సమానంగా హీరోయిన్లకు రెమ్యునరేషన్‌ రావడంలేదని వాపోతూ వార్తల్లోకెక్కింది 'రక్తచరిత్ర', 'లయన్‌', 'లెజెండ్‌' చిత్రాల ఫేం రాధికా ఆప్టే. సినీ పరిశ్రమలో మేల్‌ డామినేషన్‌కి ఇదే నిదర్శనం అని రాధిక వివరించింది. కానీ సినిమా అంటే బిజినెస్‌ ఆర్ట్‌. సినిమా కమర్షియల్‌ విజయం సాధించాలంటే హంగులు తప్పవు. హీరో స్టామినాని బట్టి సినిమాలకు కమర్షియల్‌ వాల్యూ వస్తుంది. అప్పుడప్పుడూ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సబ్జెక్ట్స్‌తో వచ్చే సినిమాలు కూడా వసూళ్ళు రాబట్టినా, వాటి శాతం చాలా తక్కువ. హీరోయిన్‌కి ఏడాదిలో డజనుకు పైగా సినిమాలు చేసే ఛాన్స్‌ ఉంటుంది. హీరోలకు అలా కాదు. హీరోలకి రెమ్యునరేషన్‌ ఎక్కువ వచ్చే ఛాన్స్‌తోపాటు, లిమిటేషన్స్‌ కూడా ఎక్కువే. వారి స్టామినాతో సినిమా ఆడుతున్నప్పుడు రెమ్యునరేషన్‌ వారికి ఎక్కువ రాకుండా ఎలా ఉంటుంది? అంటున్నారు బాలీవుడ్‌ పండితులు రాధిక వ్యాఖ్యలపై స్పందిస్తూ. విద్యాబాలన్‌ లాంటివారు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్‌ అందుకుంటున్నారని కూడా చెబుతున్నారు వారు.

మరిన్ని సినిమా కబుర్లు
sardar has mega phone