Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
navvunaluguyugaalu

ఈ సంచికలో >> శీర్షికలు >>

వారఫలాలు 07-08-2015 నుండి13-08-2015 వరకు - శ్రీకాంత్

..

  

మేష రాశి :  ఈవారం మొత్తంమీద మిత్రులతో మీకున్న పరిచయాలు మరొకసారి సరిచుసుకోవడం మంచిది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. కుటుంభంలో సంతానం విషయంలో మార్పులు కలుగుటకు ఆస్కారం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయాలు మరింత బలపడే అవకాశం ఉంది. దూరప్రదేశం నుండి విలువైన సమాచారం పొందుతారు అలాగే ప్రయాణాలు అనుకూలిస్తాయి. శారీరకశ్రమను కలిగి ఉంటారు ముఖ్యంగా భోజనం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట సూచన. మార్పులను స్వాగతించుట వలన నూతన ఆలోచనలకు శ్రీకారం చుట్టే అవకాశం లభిస్తుంది. వాహనముల మూలాన ఊహించని ఖర్చులకు ఆస్కారం కలదు జాగ్రత్త.                    

 

వృషభ రాశి :ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారులతో కలిసి చేయు పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో పెద్దల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. ధనమునకు సంభందించిన విషయాల్లో మాత్రం ఖర్చులను అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మేలు. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం కలదు. మిత్రులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సోదరుల నుండి సమయానికి సహకారం లభిస్తుంది. మొండినిర్ణయాలు తీసుకొనే అవసరం వచ్చే అవకాశం ఉంది మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి.              
 
మిథున రాశి : ఈవారం మొత్తంమీద కుటుంభంలో మార్పులకు అవకాశం ఉంది వాటికి అనుగుణంగా మీయొక్క ఆలోచనలు మార్చుకొనే ప్రయత్నం చేయుట మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని ఇస్తారు. మిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికపరమైన విషయల్లో కాస్త ఇబ్బందిని పొందుతారు. బంధువులతో కలిసి చేపట్టిన పనుల్లో కొంతమేర పురోగతి ఉన్న పనిభారం పెరుగుతుంది. మీయొక్క ఆలోచనవిధానం మార్చుకోవడం అవసరం. అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. నూతన నిర్ణయాల విషయంలో దృడమైన సంకల్పం అవసరం. నూతన వాహనముల కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది.       

 

కర్కాటక రాశి : ఈవారం మొత్తంమీద ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించినమేర సహకారం లభిస్తుంది. రాజకీయరంగాలలో ఉన్నవారికి నూతన అవకాశాలు అలాగే పరిచయాలు కలుగుతాయి. చిననాటి మిత్రులు లేదా మీ శ్రేయోభిలాషుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి ముందుగా ఉన్నవాటికి ప్రాధాన్యం ఇవ్వడం సూచన. వ్యాపారపరమైన విషయాల్లో బద్ధకం వీడండి. సర్దుబాటు విధానం కొన్ని కొన్ని విషయాల్లో అవసరం అని గుర్తిస్తారు. విదేశీప్రయాణ అవకాశాలు మెరుగుపడుతాయి. ఇష్టమైన వ్యక్తులతో సమయాన్ని గడిపే అవకాశం ఉంది.            

 

 సింహ రాశి :  ఈవారం మొత్తంమీద చివరలో ఆర్థికంగా ఆశించిన విధంగా ధనం సర్దుబాటు అవుతుంది. మీయొక్క మాటతీరు చాలామందికి నచ్చకపోవచ్చును కావున సర్దుబాటు అవసరం. మానసికంగా చిన్న చిన్న విషయల మూలాన అధికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం కలదు. దైవసంభందమైన పూజలకు సమయం ఇవ్వడం అనేది సూచన. మిత్రులతో చేయు చర్చలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవచ్చును. కుటుంభసభ్యుల నుండి సహకారం ఆశిస్తారు మిశ్రమఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం కలదు. గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు జరుగుటకు ఆస్కారం కలదు.                       

   

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో జీవితభాగస్వామితో మీ ఆలోచనలు పంచుకుంటారు. నూతన ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కాస్త శ్రమపెట్టుట అవసరం. మిత్రులనుండి విలువైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధను కలిగి ఉండుట అవసరం. స్వల్పప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. సంప్రదాయ పనులలో బాగా రాణిస్తారు కావున ఈ విషయంలో సరైన ప్రయత్నాలు చేయుట మంచిది. సోదరసంబంధమైన విషయాల్లో వారితో చర్చలు చేయుటకు అవకాశం ఉంది. సంతానం మూలాన సంతోషాన్ని పొందుతారు వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆస్కారం కలదు. 

 


తులా రాశి : ఈవారం మొత్తంమీద నలుగురిలో ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కొన్ని కొన్ని విషయాల్లో తోటివారితో సర్దుకుపోకపోతే నూతన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త. కుటుంభసభ్యుల నుండి నూతన విషయాలు తెలుసుకొనే అవకాశం ఉంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. దైవసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు. చిననాటి మిత్రులతో కలిసి సమయాన్ని విందులకు ఇస్తారు వాటిలో పాల్గొంటారు. చిన్న చిన్న విషయాలకే అనవసరమైన వివాదాలు కలుగుటకు ఆస్కారం కలదు. 

 

 
.వృశ్చిక రాశి  : ఈవారం మొత్తంమీదనూతన పరిచయాలకు ఆస్కారం కలదు. చిననాటి మిత్రులనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దైవసంభందమైన విషయాల్లో పాల్గొనే ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారులతో సత్సంభందాలు ఉంటారు అలాగే వారితో కలిసి చర్చాసంబంధమైన విషయాల్లో పాలుపంచుకుంటారు. కుటుంబంలో సభ్యులతో మీయొక్క ఆలోచనలను పంచుకొనే క్రమంలొ అనుగుణంగా వ్యవహరించుట మేలు. మాటపట్టింపులకు పోకపోవడం వలన విభేదాలు తగ్గుతాయి నిదానం అవసరం. చాలావిషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు  అవకాశం ఉంది. వాహనముల మూలాన ఇబ్బందులు కలుగుతాయి.

 

 


ధనస్సు రాశి  : ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాలలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. సంతానం మూలాన అనుకోని ఖర్చులను పొందుతారు. రాజకీయపరమైన రంగాల్లో ఉన్నవారికి ఊహించని మార్పులకు ఆస్కారం ఉంది. వాహనముల మూలాన లేక అగ్నిసంభందమైన విషయాల వలన ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త. గతంలో మీరు తీసుకున్న నిర్ణయం మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఉద్యోగంలో బాగానే ఉంటుంది అధికారులతో గుర్తింపును పొందుతారు. తలపెట్టిన పనులలో కొంత పనిబారం పెరుగుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఒకింత ఆందోళనకు గురిచేసే అవకాశం కలదు.                      

 

  

మకర రాశి : ఈవారం మొత్తంమీద నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. గతంలో చేసిన పనులకు గాను నలుగురిలో గుర్తింపును పొందుతారు. విదేశీప్రయాణాలు కలిసి వస్తాయి అలాగే చేయుటకు అవకాశం కలదు. కొన్ని కొన్ని విషయాల్లో మీయొక్క మాటతీరు మీ అనుకొనే వాళ్ళను ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. ఉద్యోగప్రయత్నాలు కలిసి వస్తాయి కాకపోతే బద్దకాన్ని వదిలి ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళుట సూచన. గృహోపకరణాల వస్తువులను విలువైనవాటిని కొనుగోలుచేసుకొనే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కుటుంబంలో పెద్దలకు ఇబ్బంది కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి.             

 

  
కుంభ రాశి : ఈవారం మొత్తంమీద ఇష్టమైన వ్యక్తులతో చేయు చర్చలు ఒక కొలిక్కి వస్తాయి. సంతానపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులను అదుపులో ఉంచుకోనుటలో విఫలం అవుతారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకొనుట అలాగే నూతన పెట్టుబడులకు దూరంగా ఉండుట సూచన. మీ ఆలోచనల్లో అలాగే మానసికంగా కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. కుటుంబసభ్యులకు అనుగుణంగా మెలగడం వలన మేలుజరుగుతుంది. అధికారులతో చేసిన చర్చలు మిశ్రమఫలితాలను ఇస్తాయి.

 

 


మీన రాశి :ఈవారం మొత్తంమీద వ్యాపారపరమైన విషయాల్లో ఆశించిన మార్పులకు ఆస్కారం కలదు. నూతన పెట్టుబడులకు సంబంధించి పనులు వేగంగా ముందుకు కదులుతాయి. స్త్రీ / పురుషుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. మిత్రులతో కలిసి నూతన పనులను చేపట్టి అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. దూరప్రదేశం నుండి ఒక వార్తను వినే అవకాశం ఉంది. మీయొక్క ఆలోచనలు కొంతమందికి నచ్చకపోవచ్చును వారినుండి సూచనల విషయంలో ఒక నిర్ణయానికి రండి. సంతానపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులకు ఆస్కారం ఉంది. వాహనముల విషయంలో అలాగే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి.

టి. శ్రీకాంత్ 

వాగ్దేవి జ్యోతిషాలయం 

మరిన్ని శీర్షికలు
humour interview