Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
White Hair? | Grey Hair? | జుట్టు తెల్లబడుతోందా? | Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

 
శ్రీ గురుభ్యోర్నమః

నేటికి మనకు ఎన్నో దేశాల్లో (జపాన్, చైనా , భారతదేశంలో ) ఆకాశంలోని నక్షత్రాలు గురుంచి ఎన్నో జానపదకథలు ఏర్పడాయి. మానవుడు గడియారం లేని కాలం నుండి ఆకాశంలో సూర్యుడు, అలాగే నక్షత్రాలను గమనిస్తూ కాలంలోని ఎన్నో మార్పులను తెలుసుకున్నాడు. నేటికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో నక్షత్రాల గమనం ఆధారంగా సమయాన్ని గుర్తుపట్టడం అలాగే కాలంలో వచ్చే మార్పులను చెప్పగలుగుతున్నారు. మన పూర్వీకులు చంద్రుడు గమనం తను తిరుగుతున్న నక్షత్రాలను ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశులను వాటినుండి ఫలితాలను తెలియజేసారు. ఆస్ట్రేలియాలో అగస్త్య,మృగవ్యాధ నక్షత్రాలు చలికాలం మొదలుఅవుతున్న సమయంలో కనబడుతాయి. అక్కడి కొన్ని జాతుల వారు ఆ నక్షత్రాలు చలిని వెంటబెట్టుకొని వస్తాయని నమ్ముతారు.

తులారాశిలో నక్షత్రాలు :-

చిత్తానక్షత్రంలోని రెండు పాదాలు, స్వాతి నక్షత్రం, విశాఖనక్షత్రంలోని మూడు పాదాలు ఈ రాశికి చెందుతాయి. స్వాతి నక్షత్రాన్ని కరువలి రిక్క అని పిలుస్తారు. స్వాతికి నిస్ట్య అనే పేరు కూడా ఉంది. దీనికి ఆదిదైవం వాయువు. భూతేశమండలంలోని తోలి అవడం చేత ఆల్ఫాభుటీస్ అని ఆర్క్ చూరస్ అనీ పేర్లు కలవు. ఏకాదశ రుద్ర రూపాల్లో ఈ భుతెషుడు ఒకరు. విశాఖనక్షత్రం కు జోడువేల్పుల రిక్క అని పేరు. ఆకారాన్ని బట్టి చేటరిక్క, కమ్మరిసారే అని పేరులు ఉన్నాయి. విశాఖకు ఇంద్రాగ్నులు అధిదైవం. కుమ్మరిసారె రూపంలో గుండ్రంగా అమరిఉన్న అయిదు చుక్కలు ఉండటం వలన విశాఖ కులలచక్ర పంచ అన్నారు. ఖగోళ తులారాశిలో తక్కెడ రూపంలో ఉన్నరూపమే విశాఖ. సూర్యుడు తులరాశిలోకి ప్రవేశించినపుడు సమస్త లక్షణాలు సరిసమానం అవుతాయి. సూర్యుడు తులారాశిలో ఉన్నపుడు పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.

జ్యోతిషంలో తులారాశి నక్షత్రాలు :-   

తులారాశి చరరాశి. తులరాశికి శుక్రుడు అధిదేవత. ఇక్కడ రవి గ్రహం నీచను పొందుతుంది. శనిగ్రహం ఈరాశిలో ఉచ్చస్థితిని పొందుతాడు. చంద్రుడు చిత్తా 3, 4 పాదాలు, స్వాతి,విశాఖ లలో సంచరిస్తున్నపుడు జాతకుడు జన్మిస్తే తులరాశికి చెందుతాడు. చిత్తకు కుజుడు అధిపతి. స్వాతికి రాహువు,విశాఖకు గురుడు అధిపతి. కాలపురుషఅంగంలో కడుపులో భాగాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ తెలియజేస్తుంది. తులారాశి వాయుతత్త్వం కు చెందిన రాశి.

వృశ్చికరాశిలోని నక్షత్రాలు :-      

విశాఖ చివరిపాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ట నక్షత్రం లోని నాలుగు పాదాలు. అనురాధ కు చెలిమిచుక్క అని , తోరనపు చుక్క అని పేరు. అనురాధకు అధిదైవం మిత్రుడు. వృశ్చికరాశిలోని బీటా , డెల్టా , పై సంజ్ఞలు గల చుక్కలు అనురాధ నక్షత్రపు చుక్కలు. చత్రకార త్రయం మూడుచుక్కలు గొడుగు ఆకృతిలో కనభడుతాయి. జ్యేష్ట నక్షత్రంనకు తాతిరిక్క అనే పేరు కలదు. జ్యేష్ట వృశ్చికరాశిలో తోలి చుక్క. దీన్నే ఆల్ ఫా స్కార్పియో అని అంటారు. ఆల్ ఫా , సిగ్మా , టౌ గుర్తులున్న నక్షత్రాలు కలిసి జ్యేష్ట అనే గుంపు ఏర్పడింది. అధిదైవం ఇంద్రుడు. ఈ నక్షత్రం సూర్యుని కన్నా తొమ్మిది కోట్ల రెట్లు పెద్దది.

జ్యోతిషం ప్రకారం వృశ్చికరాశి నక్షత్రాలు :-

ఈ రాశి స్థిరరాశి అలాగే జలతత్వం కు చెందినది. చంద్రుడు విశాఖ చివరిపాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ట నక్షత్రం లోని నాలుగు పాదాలలో సంచరిస్తున్నపుడు జన్మిస్తే జాతకుడు వృశ్చికరాశికి చెందిన వాడు అవుతాడు. ఈ రాశికి కుజుడు అధిపతి. ఈ రాశిలో రాహువు ఉచ్చస్థితిని కేతువు నీచస్థితిని పొందుతాడు. అనురాధకు శని అధిపతి శని ఈ నక్షత్రంలో అత్య్తంత బలవంతుడని శాస్త్రం తెలియజేసింది. జ్యేష్ట కు బుధుడు అధిపతి. కాలపురుష అంగంలో స్త్రీ , పురుషులలో జనన అంగాలు, రహస్య అంగాలు తెలియజేస్తుంది.     
మరిన్ని శీర్షికలు
alaa modalindi