Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
alaa modalindi

ఈ సంచికలో >> శీర్షికలు >>

రవ్వ పులిహొర - పి. పద్మావతి

  కావలిసిన పదార్ధాలు: రవ్వ, నీళ్ళు  (సరిపడినంత)  ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర , పసుపు, ఆవాలు, మినప్పప్పు, నిమ్మకాయలు, ఉప్పు, 

తయారుచేసే విధానం:  ముందుగా గిన్నెలో ఒక గ్లాసు రవ్వకు రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఉప్పు, పసుపు వేసి బాగా మరనివ్వాలి. మరుగుతున్న నీళ్ళల్లో రవ్వను వేసి ఉండలు కాకుండా కలపాలి. 10 నిముషాలు మూతపెట్టాలి. బాగా దగ్గరికయ్యాక ఒక ప్లేటులోకి ఉడికించిన రవ్వను తీసుకోవాలి. తరువాత వేరుగా బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి ఈ పోపు మిశ్రమాన్ని రవ్వలో కలపాలి. చివరగా రెండు నిమ్మకాయల రసాన్ని ఈ రవ్వ మిశ్రమానికి కలపాలి.. అంతే వేడి వేడి రవ్వ పులిహోర రెడీ..  

మరిన్ని శీర్షికలు