Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

రాజమౌళి నెంబర్‌ వన్‌: మహేష్‌

mahesh says rajamouli number - 1

తెలుగు సినిమాల్లో నెంబర్‌ వన్‌ ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానంగా మహేష్‌ లేదా పవన్‌ పేర్లు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ ఇద్దరిలో ఎవరూ నెంబర్‌ వన్‌ పొజిషన్‌ గురించి ఆలోచించరు. పవన్‌కళ్యాన్‌ అయితే మరీనూ. హిట్టొచ్చినా, ఫ్లాపొచ్చినా పవన్‌ ఒకేలా ఉంటాడు. పవన్‌లానే మహేష్‌ కూడా. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే చిరంజీవి తర్వాత తెలుగులో నెంబర్‌ వన్‌ ఎవరూ ఉండరు. 1 టు 10 ఆయనే అని చెప్పిన మహేష్‌, ప్రతి శుక్రవారం నెంబర్‌ వన్‌ పొజిషన్‌ మారిపోతుంటుందని తాజాగా చెప్పాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజమౌళి మాత్రమే నెంబర్‌ వన్‌ అని మహేష్‌ వెల్లడించాడు. తెలుగు సినిమా స్థాయి హీరోని మించిపోయింది అని నిర్మొహమాటంగా, నిగర్విగా మహేష్‌ చెప్పిన విషయం అక్షర సత్యం. సినిమాగా 'బాహుబలి' 250 కోట్లు వసూలు చేయడం తెలుగు సినిమాకి గర్వకారణం. హీరో ప్రభాస్‌ కష్టం, విలన్‌గా నటించిన రాణా పెర్ఫామెన్స్‌, సినిమాలో కీలక పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ, దర్శకుడు రాజమౌళి ఇలా అందరూ కలిస్తేనేగానీ 'బాహుబలి' అవలేదు. 

మరిన్ని సినిమా కబుర్లు
Producer srtihasan