Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mahesh says rajamouli number - 1

ఈ సంచికలో >> సినిమా >>

నిర్మాతగా శృతిహాసన్‌

Producer srtihasan

అందాల భామ శృతిహాసన్‌ నిర్మాతగా మారుతోంది. 'ఇసిడ్రో' అనే పేరుతో సినీ నిర్మాణ సంస్థను స్థాపించదలచింది. తండ్రి కమల్‌హాసన్‌లానే శృతిహాసన్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌. మ్యూజిక్‌లో ప్రావీణ్యం ఉంది. పాటలు కూడా పాడుతుంది. నటనలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంది. దర్శకత్వంలో బేసిక్స్‌ ఎప్పుడో నేర్చుకున్న శృతిహాసన్‌ సందర్భమొచ్చినప్పుడు ఆ టాలెంట్‌ కూడా బయటపెడుతుందట. ఎసిడ్రో అంటే మాటల పుట్ట అని అర్థం. శృతిహాసన్‌ మాత్రం టాలెంట్స్‌ పుట్ట. తన యాటిట్యూడ్‌కి తగ్గ పేరే పెట్టుకుంది శృతిహాసన్‌, తన స్థాపించనున్న నిర్మాణ సంస్థకి. తెలుగు సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయిన శృతిహాసన్‌కి తమిళంలోనూ, హిందీలో కూడా మంచి గుర్తింపే ఉంది. ఎంత ఎదిగినా ఒదిగే ఉండడం శృతిహాసన్‌లో మరో ప్రత్యేకత. సినిమా ప్రమోషన్‌కి సహకరించడంతోపాటు, అందరితో సత్సబంధాలు కలిగి ఉండే శృతి నిర్మాతగా మారితే, తండ్రిలా విలక్షణ చిత్రాలు నిర్మిస్తుందేమో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
Akkineni , Mega descendants comming on Dussehra