Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avika , rajtarun  wants to hit again

ఈ సంచికలో >> సినిమా >>

మెగా ఫాన్స్‌కి పండుగ షురూ

festival starts for the mega fans

మెగాస్టార్‌ చిరంజీవి తన ఫాన్స్‌కి పుట్టినరోజు కంటే ముందే 'గిఫ్ట్‌' ఇచ్చేశారు. ఇది జస్ట్‌ టీజర్‌. అసలు సినిమా ముందుంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరంజీవి లేటెస్ట్‌ స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ స్టిల్స్‌లో చిరంజీవి ఇదివరకటిలా గ్లామరస్‌గా కనిపిస్తున్నారని అభిమానులు అంటున్నారు. మేచో లుక్‌తో మెగాస్టార్‌ చిరంజీవి కనిపిస్తుంటే అభిమానుల ఆనందానికి హద్దుంటుందా? పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో చేయనున్న సినిమా కోసం టీజర్‌లా చిరంజీవి ఈ ఫొటో సెషన్‌ చేయించుకున్నారని కూడా సమాచారమ్‌ అందుతుంది. అయితే పుట్టినరోజు సందర్భంగా చిరు ఇలా ఫొటో సెషన్స్‌కి దిగడం ఆనవాయితీనే. రాజకీయాలతో బిజీ అయిపోయి సినిమాల్ని పక్కన పెట్టిన చిరంజీవి, మళ్ళీ వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌ చేయనున్న ఈ సినిమా ఆగస్ట్‌ 22న లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఫొటోస్‌తో ముందే పండగ చేసుకుంటున్న అభిమానులు, మెగాస్టార్‌ పుట్టిన రోజు వేడుకలకు ఇంకా ఉత్సాహంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddaam