Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Constipation | Ayurvedic Treatment | మలబద్ధకం, ఆయుర్వేద చికిత్స | Dr. Murali Manohar , M.D.

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిష్యం విజ్ఞానం - శ్రీకాంత్

 

శ్రీ గురుభ్యోర్నమః

మన వేదాల్లో అలాగే మన సూక్తాల్లో నక్షత్రాలు,ఆకాశం అలాగే ఖగోళం గురుంచి అనేక విషయాలు తెలియజేసాయి. పురుషసూక్తంలో వేయుచేతులు, వేయు తలలు కలిగి ఉండి విశ్వాన్ని నడిపిస్తున్నాడు అని చెబుతాం. మూడు అడుగులతో  విశ్వం మొత్తాన్ని ఆక్రమించాడు అని చెబుతాం. అంటే మన పూర్వీకులు తమ యొక్క ఆలోచనల్లో ఖగోలానికి ఇచ్చిన ప్రాధన్యత మనకు తెలుస్తుంది. ఒకసారి మనం లోతుగా ఆలోచన చేస్తే రుతువులు,నక్షత్రాలు అలాగే ఖగోలంలోని గ్రహాలు మానవుల పైన వివిధ రూపాలుగా చూపిస్తుంది అనేది వాస్తవం. మనం సముద్రాన్ని దగ్గరి నుండి చుస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా అగ్నిపర్వతాలు, ప్రక్రుతి కాని వాటిలో వచ్చే ఉద్రుక్తతను మనం ముందుగానే కనిపెట్టడం చాల వరకు కష్టమే. అలాగే సముద్రంలో పౌర్ణమి. అమావస్యలకు సముద్రంలో ఆటుపోట్లు ఎందుకు ఎక్కువ అవుతాయి ఏది మనకు సైన్స్ చెప్పంది. అదేవిధంగా మన పూర్వీకులు కూడా ఆ రెండు రోజులకు అత్యంత ప్రాధన్యం ఇచ్చారు.

ధనుస్సు రాశిలోని నక్షత్రాలు : -  

ధనుస్సురాశిలో మూలానక్షత్రంలో 4 పాదాలు, పూర్వాషాడ 4 పాదాలు, ఉత్తరాషాడ మొదటిపాదం ఉంటాయి. మూలానక్షత్రానికి సోకురిక్క అని పేరు. ఈ నక్షత్రానికి నిర్రుతి , పితురులు అధిపతులు. తేలుకోండి ఆకారంలోని 11 నక్షత్రాల సమూహం మూల అవుతుంది. వృశ్చికపు తోకలోని చిట్టచివరి అయిదు చుక్కలు కలిసి మూల అవుతుంది. పూర్వషాడకు నీటిచుక్క అనే పేరు. జలదేవత ఈ నక్షత్రానికి అధిపతి. డెల్టా , ఎప్సిలాన్ చుక్కలు కలిసి పూర్వాషాడ అవుతుంది.

రాశిచక్రంలో ధనస్సురాశి నక్షత్రాలు: -     

ధనస్సుకు అధిపతి గురుడు. సహజ ధనాధిపత్యం అలాగే సంతానకారకుడు గురుడు. మూలానక్షత్రానికి కేతువు అధిపతి. పూర్వాషాడ నక్షత్రానికి శుక్రుడు అధిపతి. చంద్రుడు మూల, పూర్వాషాడ అలాగే ఉత్తరాషాడ మొదటి పాదంలో సంచరిస్తున్నపుడు జన్మిస్తే ధనుస్సు రాశికి చెందుతాడు. కాలపురుషుని అంగంలో తొడలు సూచిస్తుంది. అలాగే గురుడు కాలయం కు అధిపతి.

మకరరాశిలోని నక్షత్రాలు :-      

ఉత్తరాషాడలోని చివరి మూడుపాదాలు , శ్రవణంలోని 4 పాదాలు, ధనిష్ట నక్షత్రంలోని మొదటి రెండు పాదాలు ఈ రాశికి చెందుతాయి. వేదకాలంలో ఈ రాశిని అజం అనేవారు. మకరం పైన మేక క్రిందిభాగంలో చేపఆకారంలో ఉంటుంది. ఉత్తరాషాడ నక్షత్రం వంపులతో కనబడుతుంది. అందుకే  దీనిని ఏచకంకటి చుక్క అంటారు. కీత.ఒమ్రికాన్ గుర్తులు గల చుక్కలు ఉత్తరాషాడ. దీనికి అధిదేవతలు విశ్వదేవతలు. శ్రవణం నకు శ్రోనా అని అశ్వథామ అని పేరు కలవు. దీని ఆదిదైవం విష్నుభగవానుడు. ఈ నక్షత్రాన్ని కరివేలుపు చుక్క అంటారు. మూడు నక్షత్రాల గుంపు కలది. గడుద గుంపులోని అల్ఫాచుక్క.

రాశిచక్రంలో మకరరాశి నక్షత్రాలు:-  

ఈ రాశికి అధిపతి శనిభగవానుడు. ఈ రాశిలో కుజుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. గురుడు నీచ స్థితిని పొందుతాడు. కాలపురుసుని అంగంలో మోకాలు. ఏది చరారాశి. ఉత్తరాషాడకు అధిపతి రవి. శ్రవణం కు చంద్రుడు అధిపతి. ధనిష్ట కు కుజుడు అధిపతులు. చంద్రుడు ఈ నక్షత్రాలలో సంచరిస్తున్నప్పుడు జాతకుడు జన్మిస్తే మకరాశికి చెందుతాడు. 
మరిన్ని శీర్షికలు
avee ivee