Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
ntr wants to hit

ఈ సంచికలో >> సినిమా >>

బుల్లితెరపై జగపతి జీవిత చరిత్ర 'సముద్రం'

jagapatibabu act  serials in small screen
సినీ పరిశ్రమలో హీరోగా తన ప్రయాణం మొదలుపెట్టిన జగపతిబాబు మొదట్లో ఫ్యామిలీ హీరోగా అనేక విజయాలు సాధించాడు. ఆ తర్వాత కొంచెం డల్‌ అయినా, ఆ ఫ్యామిలీ, హ్యాండ్‌ సమ్‌ హీరో అనే మార్కు అలాగే ఉండిపోయింది. అమ్మాయిలకు, ముఖ్యంగా పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలు జగపతిబాబును చూసి ఇలాంటి వాడే తన భర్తగా వస్తే బాగుండుననుకునే కటౌట్‌ ఆయనది. అలాంటి జగపతిబాబు తన జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదుర్కొని హీరోగా నిలదొక్కుకుని, తరువాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కూడా తన సత్తా చాటి, ఇప్పుడు విలన్‌ పాత్రలో కూడా తనదైన కొత్త శైలిలో ఆకట్టుకుంటున్నాడు.

అయితే ఇదంతా సినిమా చరిత్రం. కానీ ఇప్పుడు ఆయన చరిత్ర బుల్లితెర మీదకు ఎక్కబోతోంది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా వంశీ నిర్మాణంలో 'సముద్రం' అనే పేరుతో 13 ఎపిసోడ్ల ధారావాహిక ఒకటి ప్రసారం కానుంది. ఈ ధారావాహికలో ఆయన స్వయంగా తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలను వివరించనున్నారు. ఇంతకు ముందు బుల్లితెర ప్రోగ్రాం 'కో అంటే కోటి' తో కూడా జగపతిబాబుకు బుల్లితెర పరిచయం ఉంది. 
మరిన్ని సినిమా కబుర్లు
this is fact...not graphics.anushka