Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jagapatibabu act  serials in small screen

ఈ సంచికలో >> సినిమా >>

అదంతా నిజమే, గ్రాఫిక్స్‌ కాదు: అనుష్క

this is fact...not graphics.anushka
ప్రస్తుతం వార్తల్లో తెగ పబ్లిసిటీలో ఉన్న అనుష్క కొత్త సినిమా 'సైజ్‌ జీరో'లో అనుష్క నిజంగానే అంత లావెక్కిందట. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమాలో అనుష్క డ్రమ్‌లా ఉండే అమ్మాయి పాత్రలో నటిస్తూ, తన అభిమానుల్ని భయ భ్రాంతులకు గురిచేస్తుంది. నిజంగానే తమ అభిమాన హీరోయిన్‌, కలల రాణి ఇంత లావెక్కేసిందా? ఇదంతా నిజమేనా? కాదా? గ్రాఫిక్సేమోలో అని సరిపెట్టుకుంటున్న అభిమానులకు డైరెక్టర్‌ క్లారిటీ కూడా ఇచ్చేశాడు.

ఇది గ్రాఫిక్స్‌ కాదు. మేకప్‌ కాదు. నిజంగానే స్వీటీ డాళింగ్‌ లావెక్కింది. 20 కేజీలు బరువు పెరిగింది. ఇదంతా చేయడానికి ఆమె ఆహారపు అలవాట్లును పూర్తిగా మార్చేసుకుంది. సహజంగానే యోగా బ్యూటీ అయిన అనుష్క ఆహార నియమాలు చాలా క్రమబద్దంగా ఉంటాయి. కానీ క్రమాన్ని పక్కన పెట్టేసి, రోజుకు ఏడెనిమిది సార్లు రైస్‌ ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఈ రకంగా బరువు పెరిగింది. కానీ సినిమా ఎండింగ్‌లో మళ్లీ అనుష్క స్లిమ్‌గా కనిపిస్తుంది. అలా కనిపించడానికి తన బరువును క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. ఇందులో మేకప్‌ కూడా కీలకమైనదే. అందుకే ఆమెకి మేకప్‌ చేయడానికి ముంబై నుంచి ప్రముఖ మేకప్‌ ఉమెన్‌ని తీసుకువచ్చారట. 
మరిన్ని సినిమా కబుర్లు
The value is difficult to know says rakul