Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
this is fact...not graphics.anushka

ఈ సంచికలో >> సినిమా >>

కష్టం విలువ తెలుసుకోవాలి

The value is difficult to know says rakul
వరుస అవకాశాలతో దూసుకు వెళ్లిపోతున్న స్వీట్‌ స్మైల్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తనకు కష్టం విలువ బాగా తెలుసంటుంది. అందుకు తన సినిమా కెరీర్‌లోకొచ్చిన తరువాత ఆ విలువ మరింత తెలిసిందంటుంది. ఏ ఒక్క సినిమాతోనో, ఏ ఒక్క పాత్రతోనో ఎవరికీ ఒక స్థాయి గుర్తింపు అనేది అంత తేలికగా లభించదు. ఆ గుర్తింపు వెనక చాలా కష్టం ఉంటుంది. ఇది నమ్మి తీరాల్సిందే ఎవరైనా అంటుందీ భామ. పాత్రలు కూడా మనకి నచ్చినవి చెయ్యాలనుకుంటే రావు. నాకు 'క్వీన్‌' సినిమాలో కంగనా చేసిన పాత్ర చెయ్యాలని ఉంది. కానీ అలాంటి పాత్రలు మనం కావాలనుకుంటే రావు. అదృష్టం కూడా ఉండాలి. అలాంటి అదృష్టం కూడా జీవితంలో ఒక్కసారే వస్తుంది.

అప్పుడే దాన్ని వినియోగించుకోవాలి. అలాంట సమయం గురించి ఎదురు చూస్తాను కానీ దాని కోసం మిగతా అవకాశాల్ని వదులుకోను. నా సినీ ప్రయాణంలో నేను చేసే ప్రతి పాత్ర నాకు ఒక అనుభవాన్ని నేర్పుతూ అలాంటి విభిన్న పాత్రల్లో సులువుగా ఒదిగిపోయే ఎక్స్‌పీరియన్స్‌ సాధించడానికి సహాయపడ్తుందని అనుకుంటున్నాను అని అంటుంది ఈ ముద్దుగుమ్మ. 
మరిన్ని సినిమా కబుర్లు
prabhas bolly wood entry