Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review
చిత్రం: కిక్‌ 2 
తారాగణం: రవితేజ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రవికిషన్‌, బ్రహ్మానందం, సంజయ్‌ మిశ్రా, కబీర్‌ దుహన్‌ సింగ్‌, రాజ్‌పాల్‌ యాదవ్‌, తనికెళ్ళ భరణి తదితరులు 
చాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస 
సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌ 
నిర్మాణం: నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ 
దర్శకత్వం: సురేందర్‌రెడ్డి 
నిర్మాతలు: నందమూరి కళ్యాణ్‌రామ్‌ 
విడుదల తేదీ: 21 ఆగస్ట్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే 
తల్లి కడుపులో కంఫర్ట్‌గా లేదని ఏడు నెలలకే తొందరపడి బయటకొచ్చేస్తాడు రాబిన్‌ హుడ్‌. తన కంఫర్ట్‌ కోసం ఎవరు ఏమైపోయినా పట్టించుకోని రాబిన్‌ హుడ్‌ తమని ఉద్ధరించేస్తారని విలాస్‌పూర్‌ ప్రజలు నమ్ముతారు. వారిని పీడిస్తుంటాడు సాల్‌మన్‌ సింగ్‌ ఠాకూర్‌ (రవికిషన్‌). ఎంతో నమ్మకంతో రాబిన్‌హుడ్‌ని విలాస్‌పూర్‌కి తీసుకొచ్చిన అక్కడి ప్రజల ఆశ ఫలించిందా? తన కంఫర్ట్‌ని కాదనుకుని ప్రజల కోసం రాబిన్‌హుడ్‌ మారాడా? సాల్‌మన్‌సింగ్‌ ఠాకూర్‌ని రాబిన్‌హుడ్‌ అంతమొందించాడా? అనేవి తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే 
ఎనర్జిటిక్‌ స్టార్‌, మాస్‌ మహరాజ్‌గా పేరున్న రవితేజ, ఆ ఎనర్జీని ఫుల్లుగా ప్రదర్శించేసి మాస్‌ ఇమేజ్‌ని సూపర్బ్‌గా ప్రదర్శించేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే రవితేజ, రాబిన్‌హుడ్‌ పాత్రలో జీవించేశాడు. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఫుల్‌ ఎనర్జీతో సినిమాని పరుగులెట్టించాడనడం అతిశయోక్తి కాదు. 'కిక్‌' సినిమాలో రవితేజ ఎనర్జీకీ, ఈ సినిమాలో అతని ఎనర్జీకీ ఎక్కడా తేడా ఉండదు. ఎంటర్‌టైనింగ్‌ సీన్స్‌లో, యాక్షన్‌ సీన్స్‌లో చెలరేగిపోయాడు రవితేజ. 
హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటన కూడా బాగానే చేసింది. క్యూట్‌ అప్పీల్‌తో మాస్‌, క్లాస్‌ ఆడియన్స్‌ని అలరిస్తుంది. రవితేజతో రకుల్‌ కెమిస్ట్రీ బాగా పండింది. సినిమాలో నటన పరంగా కూడా రకుల్‌కి బాగానే స్కోప్‌ లభించింది. కామెడీ బాగా పండింది. కమెడియన్స్‌ అంతా సినిమాకి న్యాయం చేశారు. విలనిజం పండించడంలో రవికిషన్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు.

కథ కొత్తదేమీ కాకపోయినా ట్రీట్‌మెంట్‌ పరంగా కొత్తదనాన్నీ, ఎనర్జీని చూపించాలనుకున్నాడు దర్శకుడు. 'కిక్‌' సినిమాలోని ఎనర్జీని 'కిక్‌2'కి ఆపాదించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం మరీ అంత కంఫర్టబుల్‌గా అనిపించకపోవడం మైనస్‌. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకుంది. పాటలు వినడానికీ, చూడ్డానికీ బాగున్నాయి. ఎడిటింగ్‌ ఓకే, ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైన రిచ్‌నెస్‌ని తీసుకొచ్చాయి. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువలు చాలాబాగున్నాయి. 
ఫస్టాఫ్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. యాక్షన్‌, రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌కి పెద్దగా బోర్‌ కొట్టించదు. ఇంటర్వెల్‌ సీన్‌ ఆకట్టుకుంటుంది. సెఎండాఫ్‌లో వేగం కాస్త తగ్గుతుంది. సీన్స్‌ వాస్తవ దూరంగా వెళ్ళిపోతాయి. మాస్‌ ఎలిమెంట్స్‌ ఓవరాల్‌గా బాగానే ఉన్నా, మాస్‌ ఆడియన్స్‌ జస్ట్‌ ఓకే అనిపించేలా ఉన్నాయి. రవితేజ తన ఎనర్జీతో సినిమాకి అడుగడుగునా పేస్‌ తెచ్చే ప్రయత్నం చేశాడు. తమన్‌ సంగీతం కూడా సినిమాకి ప్లస్‌ అయ్యింది. డైరెక్టర్‌ టేకింగ్‌ కొన్ని సీన్స్‌లో సూపర్బ్‌ అనిపిస్తే ఇంకొన్ని సీన్స్‌లో డల్‌గా అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా కంఫర్ట్‌ జోన్‌లోనే ఉండొచ్చు. సినిమాపై క్రియేట్‌ అయిన హైప్‌తో ఓపెనింగ్స్‌ బాగున్నాయి. ప్రచారం ఇంకా బాగా చేస్తే హిట్‌ అనిపించుకోడానికి తగినంత మేటర్‌ ఈ సినిమాలో ఉంది.

ఒక్క మాటలో చెప్పాలంటే

'కిక్‌' అంత 'కంఫర్ట్‌'గా లేదు

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka