Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Pawan Kalyan's Sardar Gabbar Singh

ఈ సంచికలో >> సినిమా >>

రాజ్‌ తరుణ్‌ బెస్ట్‌ ఆప్షన్‌

raj Tarun is best

ఓ యంగ్‌ హీరోతో మినిమమ్‌ బడ్జెట్‌తో సినిమా అయిపోవాలి. కమర్షియల్‌గా సినిమా మంచి విజయం సాధించాలి. హీరో ఎనర్జిటిక్‌గా ఉండి, యూత్‌కి కనెక్ట్‌ అవ్వాలి. అలాంటి హీరో టాలీవుడ్‌లో ఇప్పుడెవరు? అన్న ప్రశ్నకి సమాధానం రాజ్‌ తరుణ్‌. అనుకోకుండా హీరో అయిపోయిన రాజ్‌ తరుణ్‌ తొలి మూవీ 'ఉయ్యాల జంపాల'తో మంచి మార్కులేయించుకున్నాడు. తరువాతి చిత్రం 'సినిమా చూపిస్త మావ' సినిమాలో ఇంకా ఎనర్జిటిక్‌గా కనిపించి, ఇండస్ట్రీ అంతా తనగురించే చర్చించుకునేలా చేశాడు.

అందుకే చిన్న సినిమాల నిర్మాతలే కాకుండా పెద్ద సినిమా నిర్మాతలు కూడా రాజ్‌ తరుణ్‌ని మినిమమ్‌ గ్యారంటీ చిత్రాలకు బెస్ట్‌ ఆప్షన్‌గా పరిగణిస్తున్నారట. అలనాటి 'లేడీస్‌ టైలర్‌' చిత్రానికి సీక్వెల్‌ చేయాలనే ప్రయత్నాలు ఎంతోకాలంగా జరుగుతున్నాయి. అల్లరి నరేష్‌ ఆ చిత్రంలో నటిస్తాడని అనుకున్నారు. అయితే తాజా ఈక్వేషన్స్‌ని బట్టి రాజ్‌ తరుణ్‌ ఆ సినిమా చేస్తే బావుంటుందనుకుంటున్నారట. సంప్రదింపులు కూడా జరిగిపోయాయని సమాచారమ్‌. కంప్లీట్‌ డీటెయిల్స్‌ కొన్ని రోజుల్లోనే రావచ్చట. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam