Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌' వచ్చేస్తున్నాడు

courier boy kalyan is comming
ప్రేమ్‌ సాయి దర్శకత్వంలో నితిన్‌, యామీ గౌతమ్‌ జంటగా వస్తున్న చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. ఎన్నో కారణాలతో ఎప్పుడో షూటింగ్‌ పనులు పూర్తి చేసుకున్నప్పటికీ విడుదల మాత్రం వాయిదా పడ్తూ వచ్చింది ఈ సినిమా. ఇన్నాళ్లకి టైం కలిసొచ్చి, ఇక రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో పీకే పాత్ర చేసిన నితిన్‌ పడ్డ పాట్ల సంగతి ఎలా ఉన్నా ఈ సినిమా ధియేటర్లోకి రావడానికి మాత్రం చిత్రబృందం పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.

ఓ కొరియర్‌ వల్ల పనీ పాట లేకుండా తిరిగే ఓ యువకుడి జీవితం అనూహ్యంగా ఎలా మలుపులు తిరిగిందన్నది ఈ సినిమా కథాంశం. ఈ నేపధ్యంలో సాగే ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ ఆశక్తికరంగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు సందీప్‌ చౌతా అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని హీరో నితిన్‌ అన్నాడు. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ అందించిన ఆడియో ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి. 
మరిన్ని సినిమా కబుర్లు
varma producer, jd.director