Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
varma producer, jd.director

ఈ సంచికలో >> సినిమా >>

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో మెగా అప్పీయరెన్స్‌

mega appearence in sardar gabbarsingh
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటించిన 'శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌' సినిమాలో పవన్‌కళ్యాణ్‌ ఓ పాటలో కనిపిస్తాడు. అది ఐటమ్‌ సాంగ్‌. 'శంకర్‌దాదా జిందాబాద్‌' సినిమాలో అయితే కాస్త నిడివి ఉన్న పాత్రలోనే పవన్‌కళ్యాణ్‌ కనిపించి అభిమానుల్ని అలరించాడు. ఓ ఫైట్‌ ఉంటుంది పవన్‌కళ్యాణ్‌కి 'శంకర్‌దాదా జిందాబాద్‌' సినిమాలో. అన్నదమ్ముల మధ్య ప్రేమాభిమానాల విషయంలో ఇంకో మాటకు తావులేదు. బయట ఏవేవో గాసిప్స్‌ వినిపిస్తున్నా వాటిని మెగాబ్రదర్స్‌ ఎప్పుడూ పట్టించుకోరు. అదలా ఉంచినట్లయితే మెగాస్టార్‌ చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌ హీరోగా రానున్న 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో కనిపిస్తారని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు.

రామ్‌చరణ్‌ నటిస్తున్న 'బ్రూస్‌లీ' సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో నటించనుండగా, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లోనూ చిరంజీవి నటించడం ఖాయమైతే మెగా ఫాన్స్‌కి ఇది నిజంగానే మెగా న్యూస్‌ అవుతుంది. మెగాస్టార్‌, పవర్‌స్టార్‌ తెరపై ఒకేసారి కన్పిస్తే, ఆ కిక్కే వేరప్పా. 
మరిన్ని సినిమా కబుర్లు
tollywood with new look