Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review

చిత్రం: భలే భలే మగాడివోయ్‌
తారాగణం: నాని, లావణ్య త్రిపాఠి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్‌, అజయ్‌, నరేష్‌, సితార, మధుమిత, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్‌ తదితరులు.
చాయాగ్రహణం: నిస్సార్‌ షఫీ
సంగీతం: గోపి సుందర్‌
దర్శకత్వం: మారుతి
నిర్మాతలు: బన్నీ వాస్‌, వంశీ
విడుదల తేదీ: 4 సెప్టెంబర్ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
మతిమరుపుతో బాధపడే ఫన్నీ క్యారెక్టర్‌ లక్కీ (నాని)ది. ఏ విషయాన్ని అయినా ఠక్కున మర్చిపోతుంటాడు. ఆ మతిమరుపుతో లక్కీకి అనేక ఇబ్బందులొస్తాయి. పెళ్ళి చూపులకు వెళితే, అక్కడా మతిమరుపు ప్రదర్శిస్తాడు లక్కీ. దాంతో, పెళ్ళి క్యాన్సిల్‌ అయిపోతుంది. అయితే అనుకోకుండా ఏ అమ్మాయితో పెళ్ళి క్యాన్సిల్‌ అయ్యిందో, అదే అమ్మాయితో లక్కీ లవ్‌లో పడతాడు. కానీ తన మతిమరుపు సంగతి ఆ అమ్మాయి (లావణ్య త్రిపాఠీ)కి తెలియకుండా మేనేజ్‌ చేస్తుంటాడు లక్కీ. మతిమరుపు విషయాన్ని మతిమరుపు లక్కీ దాచగలిగాడా? ఆ మతిమరుపుతో ప్రేయసితో లక్కీ పడే కష్టాలు ఎలాంటివి? లక్కీ, తాను ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్ళి పీటలెక్కాడా? అన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే:
నాని సినిమాలు ఫెయిలయి ఉండొచ్చుగానీ, నటుడిగా నాని ఎప్పుడూ ఫెయిల్‌ కాలేదు. సినిమా సినిమాకీ మెచ్యూరిటీ ప్రదర్శిస్తూ, నటుడిగా రాటుదేలుతున్నాడు. కామెడీ విషయంలో అయితే చెలరేగిపోతాడు నాని. ఈ సినిమాలోనూ అంతే. ఏ సీన్‌లోనూ నాని నటనకి వంకలు పెట్టలేం. అల్టిమేట్‌ పెర్ఫామెన్స్‌తో సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోసేశాడు. మతిమరుపుతో బాధపడ్తున్న వ్యక్తిగా తాను ఇబ్బంది పడుతూ, కామెడీ పంచే పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగా నాని కెరీర్‌లో బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చిన మూవీస్‌లో ఇదొకటిగా నిలుస్తుంది.
హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అందంగానే కాదు, గ్లామరస్‌గానూ కనిపించింది. నటనతో ఆకట్టుకుంది. మంచి ఛాన్సులొస్తే తెలుగు తెరపై లావణ్య పెద్ద హీరోయిన్‌గా వెలగడానికి అవకాశముంది. సందర్భోచితంగా పెర్ఫామెన్స్‌ ఇచ్చి, సినిమాకి ప్లస్‌ అయ్యింది. హీరోయిన్‌ తండ్రి పాత్రలో మురళీశర్మ తనదైన వెర్సటాలిటీని ప్రదర్శించాడు. వెన్నెల కిషోర్‌ తదితరులంతా కామెడీ పరంగా సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో తమకిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధిమేర నటించి మెప్పించారు.

కథ, కథనం విషయంలో మారుతి తనదైన ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎక్కడా మిస్‌ కాకుండా జాగ్రత్తపడ్డారు. మారుతి సినిమాలంటే ఉండే వల్గారిటీ బ్రాండ్‌ ఎక్కడా ఈ సినిమాలో కనిపించకపోవడం పెద్ద ప్లస్‌. సినిమా ఆద్యంతం నవ్వులు వెదజల్లేలా డైలాగ్స్‌, సీన్స్‌ని రాసుకున్నాడు మారుతి. కథ ఓకే, కథనం కూడా ఓకే. మరీ కొత్తగా లేకున్నా, ఎంటర్‌టైనింగ్‌గా చూసుకున్నాడు దర్శకుడు. సంగీతం బాగానే వుంది. బ్యాక్‌గ్రౌండ్‌ విషయంలో అక్కడక్కడా మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్ళినట్లు అనిపిస్తుంది. ఎడిటింగ్‌ బాగుంది. సెకెండాఫ్‌లో ఇంకాస్త అవసరం అనిపిస్తుంది ఎడిటింగ్‌ పరంగా. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రపీ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

కథ మరీ కొత్తది అనలేంగానీ, హీరోని మతిమరుపుకి కేరాఫ్‌ అడ్రస్‌గా మార్చేయడం, దాంట్లోంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ లాగడం దర్శకుడి టాలెంట్‌కి నిదర్శనం. ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో అక్కడక్కడా జర్క్‌లు కనిపించినా, ఓవరాల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడా మిస్‌ అవలేదు. రొమాంటిక్‌గా, యూత్‌ఫుల్‌ ఫీలింగ్‌తో సినిమా ఆద్యంతం సాగిపోతుంది. ఓవరాల్‌గా సినిమా ఆడియన్స్‌ని కడుపుబ్బా నవ్విస్తుంది. సరదా సరదాగా సినిమా చూసొచ్చేద్దాం అనుకునేవారికి ఈ సినిమా మంచి ట్రీట్‌ ఇస్తుంది. లూప్‌ హోల్స్‌ వెతికితే బాగానే కన్పిస్తాయిగానీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ యాంగిల్‌లో చూస్తే సినిమాకి వంక పెట్టలేం. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావడం, బడ్జెట్‌ పరిమితులకు లోబడి సినిమా రూపొందడం సినిమా హిట్‌ అవడానికి సానుకూలతలు. పబ్లిసిటీ సూపర్బ్‌గా చేస్తుండడం మరో సానుకూలత.

ఒక్క మాటలో చెప్పాలంటే:
మతిమరుపుతో కడుపుబ్బా నవ్వించేశాడీ భలేమగాడు

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka